నేడు నాలుగు పథకాలకు శ్రీకారం
నిజామాబాద్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్) కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ఆదివారం ప్రారంభించనున్నట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి, సంక్షేమ పథకాల అమలు కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించాలని అధికారులకు సూ చించారు. రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం మధ్యా హ్నం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. పథకాల అమలు కోసం చేపట్టాల్సిన చర్యల గురించి వివరించారు. అనంతరం కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు దిశానిర్దేశం చేశారు. పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్ర తి మండలంలో ప్రజాప్రతినిధులను సంప్రదించి వారి సూచన మేరకు ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసుకోవాలన్నారు. ఎంపిక చేసిన ప్రతీ గ్రామంలో నూ పథకాల ప్రారంభోత్సవానికి పక్కాగా ఏర్పా ట్లు చేయాలని ఆదేశించారు. ఎంపిక చేసిన గ్రామంలోనే నాలు గు పథకాల అమలును ప్రారంభించాలని కలెక్టర్ సూచించారు. ఆహార భద్రత కార్డులకు తహసీల్దార్ నేతత్వంలో, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఎంపీడీవో ఆధ్వర్యంలో, రైతు భరోసాకు మండల వ్యవసాయ అధికారి నేతృత్వంలో, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి ఏపీవో ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను నియమించాలని సూచించారు. మండల ప్రత్యేక అధికారులు కార్యక్రమం విజయవంతం అయ్యేలా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. గ్రామాలకు వెళ్లడానికి ముందే ఆయా పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని సూచించారు. గ్రామసభల సందర్భంగా వచ్చిన దరఖాస్తులను సైతం పరిశీలించి, ఆయా పథకాల కింద అర్హుల పేర్లను జాబితాలో చేర్చాలని, పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలోనే వారికి కూడా ప్రొసీడింగ్స్ అందించాలని కలెక్టర్ సూచించారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ సంకేత్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మండలానికో గ్రామంలో
ప్రారంభోత్సవం
అధికారులకు దిశా నిర్దేశం చేసిన
కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు
Comments
Please login to add a commentAdd a comment