ఏడీబీ బృందం సందర్శన
జి.కొండూరు: రెడ్డిగూడెంలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు(ఏడీబీ) బృందం శనివారం సందర్శించింది. రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ఏడీబీ జిల్లా ప్రధాన కార్యాలయం నుంచి ఏఎఫ్‌ఎన్‌ఆర్ (వ్యవసాయం, ఆహారం, సహజ వనరులు) సెక్టార్ ఎమర్జింగ్ ఏరియా డైరెక్టర్ తకేషి యూయెడ, సీనియర్ ప్రాజెక్ట్ అనలిస్ట్ రాఘవేంద్ర, ఏడీబీ ఇండియా ఆఫీస్ నుండి ప్రాజెక్ట్ ఆఫీసర్ కృష్ణ రౌటేలా వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన బృందంలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రకతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు విభిన్న సమూహాలు ఏవిధంగా కలిసి పనిచేస్తున్నాయని రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మెన్ టి.విజయ్‌కుమార్ వివరించారు. విద్యా నేపథ్యం, వ్యవసాయ అనుభవం, ప్రకృతి రైతుల జ్ఞానంపై దృష్టి సారించి, స్థిరమైన వ్యవసాయ పద్ధతులలో వారి నైపుణ్యాన్ని క్షేత్రస్థాయిలో వివరించారు. పంటల ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బయో స్టిమ్యులెంట్ల ప్రాముఖ్యత, వాటి తయారీ, వినియోగం, ఈ ప్రక్రియలో దేశీ ఆవుల కీలక పాత్రను బృందానికి తెలియజేశారు. రెడ్డిగూడెం గ్రామంలోని 2.5 ఎకరాల మామిడి, ఒక ఎకరం వరి పొలంలో ఎ గ్రేడ్ మోడల్‌గా వరిసాగు చేసిన గోగులమూడి సునీత పొలాలను కూడా ప్రతినిధి బృందం సందర్శించింది. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment