దత్తక్షేత్ర నాద యాత్ర ప్రారంభం
పటమట (విజయవాడ తూర్పు): దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ రాష్ట్రంలో 42 ఊర్లలో చేపట్టిన దత్తక్షేత్ర నాద యాత్ర–2025ను సీఎం
చంద్రబాబు శుక్రవారం విజయవాడ పటమటలోని దత్త పీఠం వద్ద ప్రారంభించారు. చంద్రబాబు ముందుగా పీఠంలోని మరకత రాజరాజేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్న సంకల్పంతో స్వామిజీ చేపట్టిన ఈ యాత్రలో అందరూ భాగస్వాములు కావాలని అన్నారు. గణపతి సచ్చిదానంద స్వామిజీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఆధ్యాత్మికత, సాంస్కృతిక వారసత్వాలను కాపాడటంలో ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రశంసించారు. దేవదాయ, ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment