ఉమ్మడి కృష్ణాలో 8 చోట్ల రిసోర్స్ కేంద్రాలు
అవనిగడ్డ: ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎనిమిది బీసీ వసతిగృహాల్లో ఎస్‌ఆర్ శంకరన్ రిసోర్స్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా బీసీ సంక్షేమశాఖాధికారి రమేష్ చెప్పారు. మోపిదేవి ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ను ఆదివారం ఆహ్వానించారు. రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 104 వసతి గృహాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటలకు బీసీ సంక్షేమశాఖా మంత్రి సవిత మోపిదేవిలో కేంద్రాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment