ఎమర్జెన్సీ వైద్య సేవల్లో ఆధునిక ఆవిష్కరణలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎమర్జెన్సీ వైద్య సేవల్లో ఆధునిక ఆవిష్కరణలు అందుబాటులోకి రావడంతో మెరుగైన వైద్యం అందుతోందని పలువురు ఎమర్జెన్సీ మెడిసిన్ నిపుణులు పేర్కొన్నారు. ఎమర్జెన్సీ చికిత్సల నిర్వహణపై ఏపీ మెడికల్ కౌన్సిల్, కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్(సీఎంఈ) ప్రోగ్రామ్ ఆదివారం పెనమలూరు మండలం కానూరులోని కామినేని ఆస్పత్రిలో జరిగింది. సదస్సును సీనియర్ జనరల్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ టి.వి.నారాయణరావు, రిటైర్డ్ ఏడీఎంఈ, క్రిటికల్ కేర్ నిపుణుడు డాక్టర్ టి.సూర్యశ్రీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కామినేని ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.ఆర్.ఎస్.వర్ధన్, కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎం.ఎస్.ఎన్.పవన్‌కుమార్, పల్మనాలజిస్ట్ డాక్టర్ వినతి, క్లస్టర్ హెడ్ సునీల్ తదితరులు పాల్గొన్నారు. సీఎంఈలో పాల్గొన్న వారికి ఏపీ మెడికల్ కౌన్సిల్ రెండు క్రెడిట్ అవర్స్ ఇచ్చారు.
సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): సంక్రాంతి పండుగ సీజన్‌కు దక్షిణ మధ్య రైల్వే అదనంగా మరో 52 ప్రత్యేక సర్వీసులు నడపనుందని అధికారులు ప్రకటించారు. ఈ నెల 6న చర్లపల్లి – తిరుపతి (07077) రైలు చర్లపల్లిలో, తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07078) ఈ నెల 7న తిరుపతి నుంచి నడుస్తాయి. చర్లపల్లి – తిరుపతి (02764) రైలు ఈ నెల 8, 11, 15 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో ఈ రైలు (02763) ఈ నెల 9, 12, 16 తేదీల్లో, వికారాబాద్ – కాకినాడ టౌన్ (07037) రైలు ఈ నెల 13న, కాకినాడ టౌన్ – చర్లపల్లి (07038) రైలు ఈ నెల 14న, కాచిగూడ – తిరుపతి (07655) రైలు ఈ నెల 9, 16 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో రైలు (07656) 10, 17 తేదీల్లో నడుస్తుంది. చర్లపల్లి – నర్సపూర్ (07035) ఈ నెల 11, 18 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07036) ఈ నెల 12, 19 తేదీల్లో నడుస్తుంది. సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ (07078) ఈ నెల 12, 19 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07079) ఈ నెల 12, 19 తేదీల్లో నడుస్తుంది. చర్లపల్లి – నర్సాపూర్ (07033) రైలు ఈ నెల 7, 9, 13, 15, 17 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07034) 8, 10, 14, 16, 18 తేదీల్లో నడుస్తుంది. చర్లపల్లి – కాకినాడ టౌన్ (07031) రైలు 8, 10, 12, 14 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07032) 9, 11, 13, 15 తేదీల్లో నడుస్తుంది. నాందేడ్ – కాకినాడ టౌన్ (07487) రైలు 6, 16 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07488) 7, 14 తేదీల్లో ప్రయాణిస్తుంది. చర్లపల్లి – శ్రీకాకుళం రోడ్డు (07025) రైలు ఈ నెల 9, 12, 14 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07026) ఈ నెల 10, 13, 15 తేదీల్లో నడుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment