సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయాలి
పటమట(విజయవాడ): మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులకు నేటికీ సర్వీస్ రూల్స్ లేకపోవటం బాధాకరమని ఏపీ మున్సిపల్ ఉద్యోగుల సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీఎంఈఎస్‌ఏ)రాష్ట్ర అధ్యక్షుడు తిమ్మసర్తి నాగేశ్వరరావు అన్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆదివారం అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన టి.నాగేశ్వరరావు ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికై నా ప్రభుత్వం వెంటనే కార్పొరేషన్ ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయాలని, అర్హత ఉన్న ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలన్నారు. ముఖ్యఅతిథి ఏపీ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వంలో ప్రధాన భూమిక పోషిస్తున్న మున్సిపల్ శాఖ కార్పొరేషన్ ఉద్యోగులకు కనీసం సర్వీస్ రూల్స్ లేకపోవడంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ రూల్స్‌నే అమలు చేయడం దారుణమన్నారు. అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు దొప్పలపూడి ఈశ్వర్ మాట్లాడుతూ అర్హత ఉన్న ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేలా కృషి చేయాలన్నారు. అనంతరం నూతన అధ్యక్షుడు నాగేశ్వరరావును సన్మానించారు. అసోసియేషన్ కేలండర్ 2025ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏపీపీటీడీ(ఆర్టీసీ)ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శంకర్, గ్రామ వార్డ్ సచివాలయం ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.అరలయ్య, ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం అధ్యక్షురాలు పారే లక్ష్మి, సెక్రటరీ జనరల్ పొన్నురు విజయలక్ష్మి, అసోసియేషన్ అసోసియేట్ అధ్యక్షుడు వరాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment