పోలీస్ ప్రజావాణిలో 92 ఫిర్యాదులు
విజయవాడస్పోర్ట్స్: పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి 92 ఫిర్యాదులు స్వీకరించినట్లు డెప్యూటీ పోలీస్ కమిషనర్(డీసీపీ) ఏబీటీఎస్ ఉదయరాణి తెలిపారు. కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, సైబర్ నేరాలు, మోసాలు, దొంగతనాలు, కోట్లాటలు, రోడ్డు ప్రమాదాలపై ప్రజలు ఫిర్యాదులు అందజేశారన్నారు. ఫిర్యాదుదారులతో మాట్లాడిన అనంతరం సదరు ఫిర్యాదులను నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాలని సంబంధిత స్టేషన్ల అధికారులను ఆదేశించామని డీసీపీ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment