విద్యార్థుల మేధాశక్తికి ప్రదర్శనలు అవసరం
రాయగడ: విద్యార్థుల మేధాశక్తికి పదునుపెట్టేలా విధంగా విజ్ఞాన ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని కల్యాణసింగుపూర్ అటవీ శాఖ రేంజర్ చందన్ గొమాంగొ అన్నారు. జిల్లాలొని కల్యాణసింగుపూర్ ఉన్నత పాఠశాలలో మంగళవారం జరిగిన విజ్ఞాన ప్రదర్శనకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను కనబరిచేందుకు ఇలాంటివి ఎంతగానో దోహదపడతాయని అన్నారు. సమితిలో గల వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు 80 ప్రాజెక్టులను ప్రదర్శించారు. సమితి ఏబీఈఓ మోహనరావు కొండగిరి తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ ప్రదర్శనకు బహుమతులను అందజేశారు.
బిసంకటక్ సమితి వైస్ చైర్మన్‌పై కేసు నమోదు
రాయగడ: జిల్లాలోని బిసంకటక్ సమితి వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న దేవి ప్రసాద్ పట్నాయక్ పై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బిసంకటక్‌లో గల ఆదివాసీ ఉన్నయన పరిషత్ తరఫున సొమవారం సాయంత్రం ఈ మేరకు పొలీస్ స్టేషన్‌లో కేసు నమోదవ్వడం విశేషం. ఆదివాసీ ఉన్నయన పరిషత్‌కు చెందిన అంగద్ కుట్రుక, సహకార్యదర్శి అభికలకకల నేతృత్వంలో ఆదివాసీలు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పట్నాయక్ పై కేసు వేశారు. ఈ నెల 15వ తేదీన దేవి పట్నాయక్ తన వ్యక్తిగత ఫేస్‌బుక్‌లో ఈ ప్రాంతానికి చెందిన ఆదివాసీలు ఎందుకూ పనికిరాని దద్దమ్మలని పోస్టు చేశారు. ఈ పోస్టు వైరల్ కావడంతో దీనిపై స్పందించిన ఆ ప్రాంత ఆదివాసీ ఉన్నయన పరిషత్‌కు చెందిన అధ్యక్షులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. అది పొరపాటును పోస్ట్ అయ్యిందని, వెంటనే డిలీట్ చేశానని ఆయన అన్నారు. దీనిపై ఆదివాసీ నాయకులతో మాట్లాడతానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment