అంగన్‌వాడీల ఆగ్రహం
జయపురం: జయపురం సబ్‌డివిజన్ కొట్‌పాడ్ సమితి నువాగాం పంచాయతీ డొంగరిగుడ గ్రామం అంగన్‌వాడీ వర్కర్ కృష్ణ ప్రియ మహంతిపై దాడి చేయడంపై తోటి అంగన్‌వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ వర్కర్ల సంఘం అధ్యక్షురాలు రేణుబాల శతృశల్య, రుకుమణి బెహరాల నేతృత్వంలో సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. దాడి చేసిన నాయిక్ సర్పంచ్ సారి హరిజన్, ఆమె భర్తపై సామదాస్ హరిజన్ లపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు కొట్‌పాడ్ బీడీఓ, సీడీపీఓ, పోలీసు అధికారులను కలసి మెమొరాండం సమర్పించారు. నాయిక్ సర్పంచ్, ఆమె భర్తపై శుక్రవారమే ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. వెంటనే నాయిక్ సర్పంచ్ సారి హరిజన్‌ను పదవి నుంచి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళనలో గీతాంజలి బెహర, శాంతిలత మహారాణ,నీలమణి సాహు,బినోదిని నాయిక్,మీణా మహంతి,రంజిత నాయిక్‌తో పాటు అనేక మంది అంగన్‌వాడీ వర్కర్లు పాల్గొన్నారు. ఈ సంఘటనపై కొట్‌పాడ్ పోలీసు అధికారి పరమానంద సునాని ప్రశ్నించగా నాయిక్ సర్పంచ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment