గ్రీవెన్స్‌సెల్‌లో సమస్యల ఏకరువు
పర్లాకిమిడి: స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం పరిపాలన, గ్రీవెన్స్‌సెల్‌కు అధికసంఖ్యలో రాణిపేట, సిద్ధమణుగు, కెరండి, కత్తలకవిటి పంచాయతీ పాటు పర్లాకిమిడి మున్సిపల్ పరిధిలోని ప్రజలు విచ్చేశారు. కలెక్టర్ బిజయకుమార్ దాస్, ఎస్పీ జితేంద్ర నాథ్ పండా, డీఆర్‌డీఏ ముఖ్యకార్యనిర్వాహణ అధికారి గుణనిధి నాయక్‌లు హాజరయ్యారు. మొత్తంగా 70 వినతులు కలెక్టర్‌కు అందగా, వాటిలో 6 అభియోగాలు అక్కడికక్కడే పరిష్కరించారు. మిగతా 55 వ్యక్తిగత సమస్యలు కాగా, గ్రామసమస్యలు 15 ఉన్నాయి. వాటిని సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఈ గ్రీవెన్స్‌కు నోడల్ అధికారి లిపినా దాస్, ఐటీడీఏ పీఓ అంశుమాన్ మహాపాత్రో, డీఎస్‌ఎస్‌ఓ సంతోష్ కుమార్ నాయక్ తదితర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment