8,400లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం
పార్వతీపురంటౌన్: ఆంధ్రా, ఒడిశా సరిహద్దు గ్రామాలైన అలమండ, కర్లి గ్రామాల్లో ఆంధ్రా, ఒడిశా ఎకై ్సజ్ సిబ్బంది సోమవారం దాడులు నిర్వహించినట్లు ఏఈఎస్ దొర తెలిపారు. ఈ సందర్భంగా పార్వతీపురం ఎకై ్సజ్ కార్యాలయం వద్ద విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఒడిశా సరి హద్దు గ్రామాల్లో సారా తయారవుతోందన్న ముందస్తు సమాచారంతో ఒడిశా ఎకై ్సజ్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో 8,400లీటర్ల పులిసిన బెల్లపు ఊటలను ధ్వంసం చేశామని చెప్పారు. రవాణాకు సిద్ధంగా ఉన్న 80లీటర్ల సారాను సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ సారా తయారీకి సంబంధించి మూడు కేసులు నమోదు చేసి ఒడిశా ఎకై ్సజ్ అధికారులకు అప్పగించామన్నారు. సరిహద్దు గ్రామాల్లో సారా తయారీపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తామని, ఒడిశా సరిహద్దు గ్రామాల నుంచి సారా రవాణా జరగకుండా చర్యలు చేపట్టామన్నారు. కార్యక్రమంలో సీఐలు సురేష్, బీఎస్‌ఎన్ మూర్తి, షేఖరుబాబు, సింహాద్రి, బి. పద్మావతి, ఎస్సైలు యు. నాగేశ్వరరావు, నరేంద్ర, శ్రావణ్‌కుమార్, రాజశేఖర్, ఎస్‌వీ రామారావు, బాబూరా వు, ఒడిశా ఎకై ్సజ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment