రామతీర్థం గిరిప్రదక్షిణను జయప్రదం చేయండి
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈ నెల 10న నిర్వహించే గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసనంద సరస్వతి పిలుపునిచ్చారు. గిరి ప్రదక్షిణ జరిగే ప్రాంతంలో కొండచుట్టూ జరుగుతున్న రహదారి పనులను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరి ప్రదక్షిణ రహదారిని ప్రభుత్వం అభివృద్ధి చేయడం శుభ పరిణామమన్నారు. వైకుంఠ ఏకాదశి రోజున గిరి ప్రదక్షిణ చేయడం ముక్తిదాయకమని ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థాన అధికారులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో రామతీర్థం సేవా పరిషత్ అధ్యక్షుడు జ్యోతి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
దాడిచేసిన వ్యక్తుల అరెస్టు
పాలకొండ: గతేడాది పదవ నెలలో పాలకొండ అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోస్టల్ (ఏఎస్పీ)పై దాడిచేసిన వ్యక్తులను అరెస్టు చేశామని డీఎస్పీ ఎం. రాంబాబు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఏఎస్పీ తనకు సెలవులు ఇవ్వడం లేదని నవగాం గ్రామానికి చెందిన బీపీఎంగా పనిచేస్తున్న కందివలస దుర్గాప్రసాద్ ఏఎస్పీపై కక్షపెంచుకున్నాడు. నేరుగా తాను దాడిచేస్తే ఉద్యోగం పోతుందన్న భయంతో కిరాయి వ్యక్తులతో మాట్లాడుకున్నాడు. విజయనగరానికి చెందిన షేక్ సాజన్, అంబటి ప్రకాష్, పుర్లి రాజులను ఇందుకు పురమాయించి ఏఎస్పీ నివాసం ఉన్న ఇంటిని చూపించాడు. వారు వారం రోజుల పాటు రెక్కీ నిర్వహించి గత ఏడాది పదోనెల 8వ తేదీన ఏఎస్పీ ఇంటి మీదకు వెళ్లి దాడి చేసి చిదకబాదారు. దీనిపై ఏఎస్పీ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. గుర్తుతెలియని వ్యక్తులుగా నమోదైన కేసులో ఏబీపీఎం దుర్గాప్రసాద్ దీనంతటికీ కీలంగా గుర్తించి ఆయనను అదుపులోకి తీసుకుని ఆయన ద్వారా దాడిచేసిన ముగ్గురిని అరెస్టు చేశామని డీఎస్పీ వివరించారు.
అంతర్ వర్సిటీ వాలీబాల్ పోటీలకు జీఎంఆర్ ఐటీ విద్యార్థినులు
రాజాం సిటీ: ఈ నెల 8 నుంచి 13 వరకు చైన్నెలోని జెప్పిరార్ యూనివర్సిటీలో జరగనున్న అంతర్ విశ్వవిద్యాలయాల వాలీబాల్ పోటీలకు జీఎంఆర్ ఐటీ విద్యార్థినులు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ డాక్టర్ సీఎల్‌వీఆర్‌ఎస్‌వీ ప్రసాద్ సోమవారం తెలిపారు. ఈ ఎంపికలు ఇటీవల జేఎన్‌టీయూ జీవీలో జరిగాయన్నారు. కళాశాలకు చెందిన పి.శ్రావణి, జె.హర్షిత, వి.ధాత్రి, వి.సాయిసుచరిత్రలు ప్రతిభకనబరిచి జేఎన్‌టీయూ జీవీ జట్టు తరఫున ఎంపికయ్యారని పేర్కొన్నారు. వారి ఎంపికపట్ల ప్రిన్సిపాల్‌తో పాటు ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ జె.గిరీష్, స్టూడెంట్ డీన్ డాక్టర్ వి.రాంబాబు, పీడీ బీహెచ్ అరుణ్‌కుమార్, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
నేడు జూనియర్స్ జిల్లా టెన్నికాయిట్ జట్ల ఎంపికలు
విజయనగరం:రాష్ట్రస్థాయిలో జరగనున్న జూని యర్స్ బాల, బాలికల టెన్నికాయిట్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలు ఈనెల 7వ తేదీన నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ప్రతినిధి సత్యనారాయణ సోమవారం తెలిపారు. ఉదయం 9గంటల నుంచి పూసపాటిరేగ మండలం కొప్పెర్లలో జరిగే ఎంపిక పోటీల్లో 2006వ సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ అనంతరం జన్మించిన క్రీడాకారులు మాత్రమే పాల్గొనేందుకు అర్హులుగా పేర్కొన్నారు. ఎంపిక పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జిల్లా జట్టులోకి అర్హత సాధిస్తారన్నారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 11 నుంచి 12వ తేదీ వరకు పలాసలో జరగనున్న అంతర్ జిల్లాల బాల, బాలికల జూని యర్స్ టెన్నికాయిట్ పోటీల్లో విజయనగరం జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు. మరిన్ని వివరాలకు ఫోన్ 94917 61126 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment