సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
రాయగడ: ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటిని సకాలంలో పరిష్కరించే విధంగా అంతా కలిసికట్టుగా కృషి చేయాలని ప్రాథమిక ఉపాధ్యాయుల సంఘం కార్యదర్శి నీలాంచల్ మిశ్రా అన్నారు. స్థానిక విద్యుత్ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో సంఘం 80వ వ్యవస్థాపక దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ముందుగా జాతీయ పతాకాన్ని సంఘం ఉపాధ్యక్షురాలు బి.సుజాత ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆర్థిక సాయం అందజేత
పర్లాకిమిడి: జిల్లాలో భవన కార్మికుల కుటుంబాలకు సీఎం నిర్మాణ కల్యాణ పథకం కింద లబ్ధిదారులకు ఆర్థిక సాయం కలెక్టర్ బిజయ కుమార్ దాస్ మంగళవారం అందజేశారు. కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో జిల్లాలోని 406 మంది కుటుంబాలకు వివాహ ఖర్చులు, ప్రసూతి, అంతిమ సంస్కార ఖర్చులు రూ.1,04,92,300లు అందజేశారు. అంతేకాకుండా భవన కార్మికుల కుటుంబాల పిల్లలకు ఉన్నత విద్యకు రూ.14,52,600 చెక్కు అందించారు. కార్యక్రమంలో జిల్లా కార్మిక శాఖ అధికారి భారతీ బెహరా, అసిస్టెంటు లేబర్ ఆఫీసర్ మదన్ మోహన్ టుడు, అమిత్ కుమార్ నాయక్, డీఐపీఆర్వో ప్రదిప్త గురుమయి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment