సరికొత్త అవకాశాలకు ప్రేరణ
భువనేశ్వర్ : సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నం రాష్ట్ర పర్యటన సింగపూర్, భారతదేశం మధ్య బంధాన్ని బలోపేతం చేస్తుందని, సరికొత్త అవకాశాలకు ప్రేరణగా నిలుస్తుందని రాష్ట్ర గవర్నర్ డాక్టరు హరిబాబు కంభంపాటి తెలిపారు. చిన్న ద్వీప దేశం నుంచి ప్రపంచ నాయకుడిగా సింగపూర్ అసాధారణ పరివర్తన చెందడం దూరదృష్టితో కూడిన పాలనకు, వ్యూహాత్మక ప్రణాళికకు నిదర్శనమని కొనియాడారు. అన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు స్ఫూర్తిదాయకమైన నమూనాగా పేర్కొన్నారు. సింగపూర్, ఒడిశా మధ్య భాగస్వామ్యాన్ని మరింతగా పెంచే ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, ప్రభావవంతమైన కార్యక్రమాలను నడపడానికి కొత్త అవకాశాల అన్వేషణలకు ఈ పర్యటన ప్రేరణగా నిలుస్తుందని గవర్నరు ఆశాభావం వ్యక్తం చేశారు.
అడవి పందుల స్వైర విహారం
వజ్రపుకొత్తూరు రూరల్: మండలంలోని బెండి, సీతాపురం, పెద్దబొడ్డపాడు, కొండవూరు తదితర గ్రామాల్లో అడవి పందులు స్వైర విహా రం చేస్తున్నాయి. ప్రధానంగా రాత్రి వేళల్లో ఆహారం కోసం తోటల్లో సంచరిస్తూ కొబ్బరి చెట్లను ధ్వంసం చేస్తున్నాయి. ప్రస్తుతం పంట పొలాల్లో అడవి పందులకు సరైన ఆహారం దొరకకపోవడంతో కొబ్బరి చెట్టుకున్న కందను తినేందుకు అలవాటుపడ్డాయని, దీంతో కొబ్బ రి చెట్లను ధ్వంసం చేస్తున్నాయని బాధిత రైతు లు వాపోతున్నారు. తిత్లీ తుఫాన్ ప్రభావంతో కొబ్బరి చెట్లు కూలిపోవడంతో వాటి స్థానంలో నాటిన కొబ్బరి చెట్లను నాశనం చేస్తున్నాయన్నారు. సంబంధిత అధికారులు స్పందించి నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
పాడుబడిన ఇంట్లో మృతదేహం
కంచిలి: మండలంలోని ఎస్.ఆర్.సి. పురం పంచాయతీ పరిధి రైల్వే స్థలంలో ఉన్న పాడుబడిన ఇంట్లో గుర్తు తెలియ ని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. ఆశవర్కర్ రాపాక డిల్లమ్మ ఆ ఇంటిని చాలా రోజుల క్రితం ఖాళీ చేసి, కంచిలిలో ఇందిరమ్మ కాలనీలో నిర్మించుకున్న ఇంటికి వెళ్లిపోయింది. ఆ వదిలేసిన పూరి గుడిసెలో గుర్తు తెలియని వ్యక్తి ఉరిపోసుకొని మృతి చెందినట్లు గుర్తించారు. ఈ ఇంటి నుంచి గత నాలుగు రోజులుగా దుర్వాసన రావడంతో స్థానికుల ఫిర్యాదు మేరకు కంచిలి ఎస్‌ఐ పి.పారినాయుడు సిబ్బందితో వెళ్లి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహానికి సోంపేట ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి వయ స్సు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. స్థానిక వీఆర్వో బి.రేణుక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment