క్రీడా సంరంభం..
● విశ్వవిద్యాలయ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు
జయపురం: విక్రమదేవ్ విశ్వ విద్యాలయ ప్రథమ వార్షిక క్రీడోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సీనియర్, జూనియర్ విద్యార్థినీ విద్యార్థులకు వేర్వేరుగా పోటీలు జరిగాయి. 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు, ట్రిపుల్ జంప్, జావిలిన్ త్రో, షార్ట్‌ఫుట్, 800 మీటర్ల రేష్, డిస్కస్‌త్రో, హైజంప్ పోటీలు నిర్వహించారు. ఉదయం తొమ్మిది గంటలకు విశ్వవిద్యాలయ విద్యార్థులు, కేడర్ విద్యార్థులు రాలీగా స్థానిక మా భగవతి మందిరానికి చేరుకున్నారు. దేవికి పూజలు చేసి అక్కడ నుంచి క్రీడా మసాల ర్యాలీ ప్రారంభమై పట్టణ ప్రధాన మార్గం మీదుగా విశ్వవిద్యాలయ క్రీడా మైదానానికి చేరుకుంది. విశ్వవిద్యాలయ పీజీ విభాగ చైర్‌పర్సన్ డాక్టర్ ప్రశాంత కుమార్ పాత్రో క్రీడా మసాల్ స్వీకరించి పతాకాన్ని ఊపి ప్రారంభించారు. క్రీడాకారుల మార్చ్‌ఫాస్ట్ అలరించింది. తరువాత డాక్టర్ పాత్రో రెండు దినాల క్రీడా పోటీలు ఆరంభమయ్యాయి. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రంజన్ కుమార్ పాత్రో, ఉపాధ్యక్షులు డాక్టర్ రక్షభ కుమార్ సాహు, ఆర్గనైజింగ్ కార్యదర్శి సచిన్ కుమార్ నాయిక్, సహాయక ఉపాధ్యక్షులు సంతోషిణి ముండ, స్పోర్ట్స్ ఉపాధ్యాయులు భగవత్ ప్రసాద్ సింగ్, విశ్వవిద్యాలయ అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment