పక్షుల లెక్కలు ప్రారంభం
జయపురం అటవీ రేంజ్ పరిధిలో..
జయపురం: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం జయపురం అటవీ విభాగ సిబ్బంది జయపురం రేంజ్ పరిధిలో పక్షుల గణన ప్రారంభించారు. జయపురం అటవీ డివిజన్ అధికారి ప్రతాప్ చంద్రబెహర సూచనల మేరకు జయపురం రేంజ్ అధికారి సచిదానంద పొరిడ బలియ జళాశయ ప్రాంతం అడవిలో రంజితా నాయిక్ టీమ్, ఎల్లో డేమ్ ప్రాంతంలో సొశాంక మహరాణ, పాత్రోపుట్ కొలాబ్ నది, జయపురం సాగర్ ప్రాంతంలో సుశీల్ మహంతి బృందాలు పక్షుల లెక్కపేట్టె కార్యక్రమంలో పాల్గొంటున్నారని అటవీ విభాగ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా జయపురం రేంజ్ అధికారి సచిదానంద పొరిడ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో పక్షులు భూమిక గురుతరమైనదన్నారు. అందుచేత పక్షులను రక్షించేందుకు వాటికి మంచిఆహారం, వాటికి తగిన ఆశ్రయ స్థలాలు, పక్షుల వంశ వృద్ధి కోసం తగు ఏర్పాట్లను అటవీ విభాగం ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. దూర్భిణీలతో పక్షులను గమనిస్తూ లెక్కిస్తున్నట్లు వెల్లడించారు. పక్షులను లెక్కించేందుకు అటవీ సిబ్బంది ఆయా ప్రాంతాలలో నిరీక్షిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment