పర్లాకిమిడి: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం స్థానిక మహారాజా బాలుర ఉన్నత పాఠశాలలో హైస్కూల్, కళాశాల స్థాయిలో విద్యార్థులకు పలు పోటీలను డీఈవో నిర్వహించారు. వక్తృత్వ, క్విజ్, దేశభక్తి గీతాలు, చిత్రలేఖనం పోటీలు నిర్వహించగా.. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. న్యాయనిర్ణేతలుగా బిచిత్రా నంద బెబర్తా, ప్రభుత్వ ఉపాధ్యాయులు అమేష్ లిమ్మా, శులతా శుభదర్శినీ, జగన్నాథ పట్నాయక్, అనితా దాస్, సింహాచల బెహారా, సుమిత్రా కుమారీ జెన్నా, సులతా నోందో, దేవీ ప్రసాద్ పట్నాయక్ వ్యవహారించారు. విజేతలకు ఈ నెల 26వ తేదీన రిపబ్లిక్ దినోత్సవ ప్యారేడ్ వద్ద బహుమతి ప్రదానోత్సవం ఉంటుందని డీపీఆర్‌వో ప్రదీప్ గురుమయి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment