రిపబ్లిక్ దినోత్సవానికి సన్నాహం
పర్లాకిమిడి: ఈ నెల 26న రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా స్థానిక గజపతి స్టేడియంలో పోలీస్ పదాతి దళాలు, వివిధ స్కూల్ విద్యార్థులు గురువారం పేరేడ్ ప్రాక్టీస్ చేశారు. ఈ ప్రాక్టీస్‌లో 3వ పోలీసు బెటాలియన్, ఎస్.కె.సి.జి కళాశాల ఎన్‌సీసీ, మహారాజా బాలుర ఉన్నత పాఠశాల, ఇతర పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
పండ్ల వ్యాపారి ఇంట్లో
బంగారం చోరీ
గార: రోడ్డుపై పండ్ల వ్యాపారం కోసం వెళ్లిన కుటుంబ సభ్యులు రాత్రి తిరిగి ఇంటికి వచ్చేసరికి వెనుక తలుపులు తెరిచే ఉన్నాయి. అనుమానం వచ్చి బీరువా తీసేందుకు తాళాల కోసం వెతకగా దొరకలేదు. విరగ్గొట్టి చూస్తే బంగారం మాయమైంది. శాలిహుండం ఎస్సీ కాలనీలో ఈ చోరీ చోటు చేసుకుంది. పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం.. శాలిహుండంకు చెందిన ఉరజాన రమణమ్మ, ఆదినారాయ ణ దంపతులు రోడ్డుపై పండ్ల వ్యాపారం చేస్తుంటారు. ఎప్పట్లాగే భైరి, సింగుపురం ఫ్లై ఓవర్ కింద పండ్ల వ్యాపారం ముగించుకొని బుధవారం రాత్రి ఇంటికి చేరుకున్నారు. ఇంటి తలుపు తీసి చూసేసరికి వెనుక తలుపు తెరిచి ఉంది. తాము వేయలేదని భావించి.. తర్వాత తన మెడలో ఉన్న హారం బీరువాలో పెడదామ ని చూశారు. తాళం లేకపోవడంతో బీరువాను పగలగొట్టి చూసేసరికి అప్పటికే బంగారం లేకపోవడంతో పోలీసులుకు ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం క్లూస్‌టీం, సీఐ పైడపునాయుడు, ఎస్‌ఐ రెల్ల జనార్ధనరావులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. కుటంబ సభ్యులతో పాటు పొరుగింటి వారిని కూడా పోలీసులు తీసుకెళ్లి విచారణ చేపట్టారు. ఉద యం 50 తులాలు బంగారం అన్న ఫిర్యాదు.. సాయంత్రమయ్యేసరికి 14.5 తులాలు మాత్ర మే పోయినట్టు కేసు నమోదు జరిగింది. కుటుంబ కలహాలు కూడా చోరీకి కారణమై ఉండవచ్చని గ్రామస్తులు చెబుతున్నారు. కాగా, వాస్తవంగా 9.5 తులాలు మాత్రమే పోయిందని, ఆ దిశగా దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు చెబుతున్నారు.
ఆస్పత్రిలో చోరీ
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని ఇలిసిపురం జంక్షన్ బొందిలీపురం వెళ్లే రోడ్డులో మంచు ఐ కేర్ ఆస్పత్రిలో చోరీ జరిగినట్లు రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు తెలిపారు. బుధవారం రాత్రి తలుపులు విరగ్గొట్టి గుర్తు తెలియని వ్యక్తులు లోపలకు చొరబడ్డారని, క్యాబిన్ డెస్క్ లో ఉన్న రూ.లక్ష నగదు, హార్డ్ డిస్క్ పట్టుకుపోయినట్లు ఆస్పత్రి ఎండీ డాక్టర్ వాసుదేవరా వు గురువారం ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
నాటుతుపాకీ స్వాధీనం
మెళియాపుట్టి: మండలంలోని భరణికోట పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో ఇద్దరు వ్యక్తులు నాటు తుపాకీతో సంచరిస్తున్నట్లుగా సమాచా రం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేసి ఇద్దరి ని బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. కోధు కొళి గాం గ్రామానికి చెందిన కోరాడ గిరి, పలాస మండలం లొత్తూరు గ్రామానికి చెందిన భుజంగరావు (అలియాస్ రాజు)ను గురువారం కోర్టులో హాజరు పరచి పాతపట్నం సబ్ జైలుకు తరలించినట్లు ఎస్సై రమేష్‌బాబు తెలిపారు. తుపాకీని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment