ఖగోళ ప్రయోగశాల ప్రారంభం
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి సమితి కేంద్రంలో ఉన్న నోడల్ ఎంఈ స్కూల్‌లో గురువారం నవరంగ్‌పూర్ ఎంపీ బోలభధ్రమాఝి చేతులమీదుగా ఖగోళ శాస్త్ర ప్రయోగశాలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఖగోళ శాస్త్రంపై అవగాహన పెంచుకోవాలని ఆకాంక్షించారు. పలు పరికరాలను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మడ్కమి, మల్కన్‌గిరి అదనపు కలెక్టర్ వేద్బ్‌ర్ ప్రదన్, జిల్లా సబ్ కలెక్టర్ దుర్యోధన్ బోయి, జిల్లా విద్యాశాఖ అధికారి విశ్వనాథ్ సాహు, మల్కన్‌గిరి డిప్యూటీ కలెక్టర్ అశోక్ చక్రవర్తి, ఎంపీ ప్రతినిధి సంజాయ్ సర్కార్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పూర్ణచంద్ర ఖండపాణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment