జూనియర్ ఫారెస్ట్ అధికారుల సంఘానికి నూతన కార్యవర్గం
గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీ జూనియర్ ఫారెస్ట్ అధికారుల సంఘం గుంటూరు శాఖ అధ్యక్ష, కార్యదర్శులుగా పి.సంతోష్‌కుమార్, వి.వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు. కలెక్టర్ బంగ్లా రోడ్డులోని కృషి భవన్‌లో ఆదివారం సంఘం గుంటూరు శాఖకు ఎన్నికలు నిర్వహించారు. కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘం గుంటూరు శాఖ ఉపాధ్యక్షుడిగా ఎన్.మోహన్‌రాజు, సంయుక్త కార్యదర్శిగా షేక్ అమీర్‌జానీ బాషా, కార్యనిర్వాహక కార్యదర్శిగా కె.వెంకయ్య, కోశాధికారిగా ఎన్.పురుషోత్తమరాజు ఎన్నికయ్యారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కె.శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు శశిభూషణ్ యాదవ్, ప్రాంతీయ కార్యదర్శి రవీంద్ర ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment