పవర్ లిఫ్టింగ్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక
తాడేపల్లి రూరల్: ఫెడరేషన్ కప్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక ఆదివారం మంగళగిరిలో నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులు కొమ్మాకుల విజయ భాస్కరరావు, ప్రధాన కార్యదర్శి షేక్ సంధానిలు మాట్లాడుతూ.. ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు ఢిల్లీలో జరగనున్న ఈ పోటీలకు 57 కేజీల జూనియర్ విభాగంలో షేక్ సాదియా ఆల్మస్, 84 కేజీల జూనియర్ విభాగంలో షేక్ షబీనా, 84 కేజీల సీనియర్ విభాగంలో బొలినేని చంద్రికలను ఎంపిక చేశామని తెలిపారు. క్రీడాకారులకు ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులు గంట వెంకటేశ్వర రావు, ప్రధాన కార్యదర్శి సకల సూర్యనారాయణ, సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సకల కోటేశ్వరరావు, గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వైస్ చైర్మన్ ఆర్‌ఎన్ వంశీకృష్ణ, కోశాధికారి గుమ్మడి వెంకటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్లు బి.ప్రసాద్, భాస్కరరావు, బి. చంద్రిక, జాయింట్ సెక్రటరీలు ఘట్టమనేని సాయి రేవతి, ఎస్‌డీ మస్తాన్ వలి, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు జి. మల్లేశ్వరరావు, పి.సందీప్, ఎ.పవన్‌కుమార్, ఎస్‌కే సుభాని, కె. మధుబాబు తదితరులు అభినందించారని వారు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment