సత్తాచాటిన గుంటూరు జిల్లా ఎడ్లు
బండలాగుడు పోటీల్లో ప్రథమ స్థానం
పెద్దారవీడు: మండలంలోని దేవరాజుగట్టులో వెలసిన కాశినాయన 29వ ఆరాధన మహోత్సవం సందర్భంగా ఆదివారం తెలుగు రాష్ట్రాల స్థాయి పెద్దసైజు బండలాగుడు పోటీలు ఉత్సాహంగా జరిగాయి. గుంటూరు జిల్లా కుంచనపల్లి గ్రామానికి చెందిన పీఆర్ మెమోరియల్ ప్రలగం ప్రతిజ్ఞరెడ్డి, జస్వితరెడ్డి ఎడ్ల జత 1,845 అడుగుల దూరం లాగి మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఎడ్ల జతకు కృష్ణా జిల్లా మైలవరం గ్రామానికి చెందిన శ్రీలం హరీష్‌రెడ్డి, ఐలూరి మురళీకృష్ణారెడ్డి రూ.60,116 నగదు బహుమతిగా అందజేశారు. బాపట్ల జిల్లా బల్లికురవ గ్రామానికి చెందిన వీరాస్వామిచౌదరి ఎడ్లజత 1,800 అడుగులు లాగి ద్వితీయ స్థానంలో నిలవగా, ఈ జతకు మార్కాపురం పట్టణానికి చెందిన దగ్గుల శ్రీనివాసరెడ్డి, దరిమడుగు గ్రామానికి చెందిన ముదిరెడ్డి శ్రీనివాసరెడ్డి రూ.50,116 అందించారు. నంద్యాల జిల్లా కుంపరమానుదిన్నె గ్రామానికి చెందిన కుందురు రాంభూపాల్‌రెడ్డి ఎడ్లజత 1,640 అడుగుల దూరం లాగి తృతీయ స్థానం, నంద్యాల జిల్లా జిల్లెలగోస్పాడు గ్రామానికి చెందిన గారటికె నాగిరెడ్డి ఎడ్లజత 1626 అడుగుల దూరం లాగి నాలుగో స్థానం, మార్కాపురం మండలం బొడిచర్ల గ్రామానికి చెందిన తిండి నక్షత్రరెడ్డి ఎడ్ల జతలు 1,620 అడుగులు, 1,092 అడుగుల దూరం లాగి ఐదు, ఆరో స్థానంలో నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment