జాతీయ ఫ్లోర్‌బాల్ చాంపియన్‌షిప్ ప్రారంభం
నరసరావుపేటరూరల్: జాతీయస్థాయి 18వ అండర్–12, అండర్–18 బాల, బాలికల ఫ్లోర్ బాల్ చాంపియన్ షిప్ పోటీలు కే–రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈనెల 31 వరకు జరగనున్న పోటీలలో 14 రాష్ట్రాల నుంచి 300 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. పోటీల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా ఇండియన్ ఫ్లోర్ బాల్ ఫెడరేషన్ వైస్ చైర్మన్ దీపేంద్ర ఆర్య, కే–రిడ్జ్ స్కూల్ చైర్మన్ నాతాని వెంకటేశ్వర్లు, ఫ్లోర్ బాల్ ఇండియా పరిశీలకుడు పంకజ్, ఫెడరేషన్ జాయింట్ సెక్రటరీ ఫ్రీజోజాన్, స్కూల్ డైరెక్టర్ కోమటనేని నాసరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ వైస్ చైర్మన్ దీపేంద్ర ఆర్య మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి విజయాలు సాధించి దేశానికి పేరుప్రఖ్యాతులు తీసుకురావాలని తెలిపారు.
ఉత్సాహంగా పోటీలు
పోటీల ప్రారంభ మ్యాచ్ ఢిల్లీ, చత్తీస్‌గడ్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో చత్తీస్‌గడ్ 5–0 తేడాతో ఢిల్లీపై విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో బిహార్, ఆంధ్రప్రదేశ్ జట్లు తలపడగా బిహార్ 6–0 తేడాతో గెలుపొందింది. మూడో మ్యాచ్‌లో తమిళనాడు 3–0 తేడాతో కర్టాటక జట్టును ఓడించింది.
14 రాష్ట్రాల నుంచి 300మంది క్రీడాకారులు ఈనెల 31 వరకు పోటీలు
Comments
Please login to add a commentAdd a comment