లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్
గురువులకు సన్మానం
సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ మన్నవ రాధాకృష్ణమూర్తి, సీనియర్ ఈఎన్‌టీ సర్జన్ డాక్టర్ ఫణీంద్రకుమార్, ఎస్‌పీఎంకు చెందిన డాక్టర్ శివరామ్‌ప్రసాద్, ఫిజియాలజీకి చెందిన డాక్టర్ ఇందిరాదేవి, డాక్టర్ నాగేశ్వరరావులను 1975 బ్యాచ్ వైద్య విద్యార్థులు ఘనంగా సన్మానించారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ కార్యక్రమానికి హాజరయ్యారు. పూర్వ వైద్య విద్యార్థులు కళాశాల అభివృద్ధికి జింఖానా పేరుతో చేస్తున్న సేవలను కొనియాడారు. రీయూనియన్ పేరుతో వస్తున్న వారంతా గుర్తుగా వైద్య కళాశాలకు, జీజీహెచ్‌కు సాయం చేయాలని కోరారు. రీ యూనియన్‌కు ఆర్ధోపెడిక్ సర్జన్ డాక్టర్ విజయభాస్కర్ కన్వీనర్‌గా, డాక్టర్ తేజానంద్ గౌతమ్, డాక్టర్ చక్రపాణి, డాక్టర్ వెంకటేశ్వరరావు, డాక్టర్ శివకుమార్, డాక్టర్ రామకృష్ణ కోర్ కమిటీ సభ్యులుగా వ్యవహరించారు. రీ యూనియన్‌కు హాజరైన వైద్యులలో 65 నుంచి 67 సంవత్సరాల మధ్య వారే ఉన్నారు. వయస్సు పైబడుతున్నా ఉత్సాహంగా వేడుకలకు హాజరై అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు.
గుంటూరు మెడికల్: ఆనాటి ఆ స్నేహం మధురాతి మధురం అంటూ కాలేజీ రోజులను వైద్యులు నెమరు వేసుకున్నారు. తరగతి గదుల్లో కూర్చుని 50 ఏళ్ల వెనక్కి వెళ్లిపోయారు. యవ్వనంలో చేసిన అల్లరిని జ్ఞప్తికి తెచ్చుకుని పులకించి పోయారు. నాటి చిలిపి పనులు, కొంటె చేష్టలు ఒక్కొక్కటిగా గుర్తుచేసుకుంటూ 60 ఏళ్లు దాటిన వృద్ధులంతా కుర్రకారుగా మారిపోయారు. వైద్య వృత్తిలో నిత్యం బిజీగా ఉంటూ దేశ విదేశాల్లో స్థిరపడిన సీనియర్ వైద్యులంతా రీ యూనియన్ పేరుతో శనివారం గుంటూరు వైద్య కళాశాలలో కలుసుకున్నారు. కళాశాలలో చేరి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గోల్డెన్ జూబ్లీ పేరుతో పూర్వ వైద్య విద్యార్థులు, సీనియర్ వైద్యులు ఒకచోటకు చేరుకుని జ్ఞాపకాలను పంచుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించారు.
85 మంది సీనియర్ వైద్యులు హాజరు
గుంటూరు వైద్య కళాశాలలో 1975 బ్యాచ్ వైద్య విద్యార్థులు 135 మంది ఉండగా, వారిలో 85 మంది శనివారం జరిగిన గోల్డెన్ జూబ్లీ రీయూనియన్ వేడుకలకు హాజరయ్యారు. అమెరికా, ఆస్ట్రేలియా, ఇతర విదేశాల్లో ఉన్నవారు, దేశంలోని పలు రాష్ట్రాల్లో పేరు ప్రఖ్యాతలు గడించిన వైద్యులంతా సమ్మేళనానికి హాజరై సంతోషాన్ని పంచుకున్నారు. గుంటూరు వైద్య కళాశాలలో 1975 బ్యాచ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఒకే ఏడాది రెండు ఎంబీబీఎస్ బ్యాచ్‌లు వైద్య కళాశాలలో చేరడం 1975 బ్యాచ్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
ఉత్సాహంగా గుంటూరు వైద్య కళాశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ఉత్సాహంగా స్వర్ణోత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment