తెలుగు నాటకరంగం– సీ్త్రవాదంపై జాతీయ సదస్సు | - | Sakshi
Sakshi News home page

తెలుగు నాటకరంగం– సీ్త్రవాదంపై జాతీయ సదస్సు

Published Sun, Jan 19 2025 1:32 AM | Last Updated on Sun, Jan 19 2025 1:31 AM

తెలుగు నాటకరంగం– సీ్త్రవాదంపై జాతీయ సదస్సు

తెలుగు నాటకరంగం– సీ్త్రవాదంపై జాతీయ సదస్సు

యడ్లపాడు: సాహితీరంగ ప్రముఖులు, తెలుగు నాటకరంగ ఉద్దండులతో సాహిత్య సదస్సును ఏర్పాటు చేస్తున్నట్లు ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల వేదిక(తెలుగు నాటక పరిషత్తుల సమ్మేళన) అధ్యక్షుడు ముత్తవరపు సురేష్‌ బాబు తెలిపారు. శనివారం యడ్లపాడులోని ఆయన నివాసంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర సాహిత్య అకాడమీ, వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 26వ తేదీన యడ్లపాడులో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘తెలుగు నాటకం – సీ్త్రవాదం’ అనే అంశాలపై రెండు విభాగాల్లో సదస్సుకు నిర్వహణకు శ్రీకారం చుట్టామన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ ఇప్పటివరకు మహానగరాల్లో మాత్రమే ఇటువంటి సదస్సులు ఏర్పాటుచేసిందన్నారు. జాతీయస్థాయి తరహాలో ఓ గ్రామీణ ప్రాంతంలో ఈ సదస్సు నిర్వహించడం ప్రథమం కావచ్చన్నారు. మేధావులు, సాహిత్య పురస్కార గ్రహీతలు సైతం ఈ సదస్సుకు హాజరవుతున్నట్లు తెలిపారు. ‘తెలుగునాటక రంగం–సీ్త్రవాదంపై తమ కలాలతో, గళాలతో జనచైతన్యం చేసే దిశగా సదస్సులు కొనసాగుతాయన్నారు. 26వ తేదీ ఉదయం 10 గంటలకు స్థానిక వేదిక కార్యాలయంలో కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. 11.30 వరకు ప్రారంభపు సభ ఉంటుందన్నారు. సాహిత్య అకాడమీ తెలుగు సలహాసంఘం సభ్యులు వల్లూరి శివప్రసాద్‌ స్వాగతోపన్యాసం, కథ, నవలా రచయిత్రి ఓల్గా కీలకోపన్యాసం, వేదిక ప్రధాన కార్యదర్శి జేవి మోహన్‌రావు వందన సమర్పణ చేస్తారన్నారు. 11.45 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు మొదటి సదస్సు మొదలవుతుందన్నారు. అంబటి మురళీకృష్ణ అధ్యక్షతన డాక్టర్‌ కందిమళ్ల సాంబశివరావు (నాటకం) సీ్త్ర చైతన్యం, నిభానుపూడి సుబ్బరాజు (పద్యనాటకం) సీ్త్ర అభ్యుదయం, సీహెచ్‌ సుశీలమ్మ (సంస్కరణోద్యమ నాటకాలు) సీ్త్ర చిత్రణపై పత్ర సమర్పణ చేస్తారన్నారు. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు జరిగే రెండో సదస్సుకు పిన్నమనేని మృత్యుంజయరావు అధ్యక్షత వహిస్తారన్నారు. దేవి (ఆధునిక వీధినాటకం) సీ్త్ర వికాసం, నల్లూరి రుక్మిణి (నాటకం పురుషాధిక్యత– సీ్త్ర ఆర్థిక స్వాతంత్య్రం, జె.కనకదుర్గ (నాటకం) ీసీ్త్ర వైవాహిక సమస్యల చిత్రీకరణపై పత్ర సమర్పణ ఉంటుందన్నారు. ఈ సదస్సులో మహిళలందరూ భాగస్వాములయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. వేదిక సంయుక్త కార్యదర్శి పోపూరి నాగేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు ముత్తవరపు రామారావు తదితరులు పాల్గొన్నారు.

కేంద్రసాహిత్య అకాడమీ, వేదిక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు 26న యడ్లపాడులో రెండు విభాగాలుగా నిర్వహణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement