వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో ‘బొంతలకోటి’కి చోటు
గజపతినగరం : జానపద కళారూపాలతో సంగీత వాయిద్య పరికరాలతో గడిచిన 25 సంవత్సరాలుగా ప్రదర్శించిన కళాబోధనకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావడం ఆనందంగా ఉందని రాష్ట్రపతి అవార్డు గ్రహీత డాక్టర్ బొంతలకోటి శంకరరావు తెలిపారు. పురిటిపెంట న్యూకాలనీలో ఆయన నివాసంలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిర్విరామంగా జానపద కళారూపాలతో బోధిస్తూ కళా, విద్యా, సాహిత్య రంగాలకు చేసిన కృషికి గుర్తింపుగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో తమ పేరు నమోదు చేయడం, తనకు చోటు దక్కడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్టు తెలిపారు. ఐదు వేల పాటలు రచించి, 100 బుర్రకథలు, 87 వీధి నాటికలు రచించి జానపద కళారూపాలతో విద్యాబోధన విధానాన్ని పరిచయం చేయడంతో తనను 2024వ సంవత్సరంలో గుర్తించి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు ప్రశంసాపత్రం, ట్రోఫి, బంగారు మెడల్ అమెరికాలోని వాషింగ్టన్ నుంచి తపాలా ద్వారా పంపినట్టు తెలిపారు. సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న శంకరరావుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కడంపై డీఈఓ యు.మాణిక్యంనాయుడు, హెచ్‌ఎం కె.శ్రీనివాసరావు, ఉప విద్యాశాఖాధికారులు కె.మోహనరావు, బి.వెంకటరమణ తదితరులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment