సిరిసిల్లకల్చరల్: ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిషన్ బుధవారం కరీంనగర్‌కు రానున్నారు. డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ షెడ్యూల్డ్ కులా ల ఉప వర్గీకరణపై వివరణాత్మక అధ్యయనం కోసం బహిరంగ విచారణ జరపనున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని పెద్దపెల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్లకు సంబంధించిన ఎస్సీ కులాల సంఘ నాయకులు హాజరు కావాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అభ్యంతరాలు, ప్రతిపాదనలు స్వీకరిస్తారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment