చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
సుల్తానాబాద్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని అదనపు కలెక్టర్ దాసరి వేణు సూచించారు. సుల్తానాబాద్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి సీఎంకప్ పోటీలను గురువారం ప్రారంభించారు. వేణు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. విద్యార్థులు క్రీడలతో శారీరక, మానసికంగా ఉల్లాసంగా ఉంటారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడా యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతుందని, క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి 650మందికి పైగా క్రీడాకారులు హాజరు కాగా.. శనివారం వరకు వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, జూడో, రెజ్లింగ్ పోటీలు జరగనున్నాయి. జిల్లా క్రీడాశాఖ, పెద్దపల్లి జూడో, రెజ్లింగ్ క్రీడా సంఘాల ఆధ్వర్యంలో ఇండియన్ పబ్లిక్ స్కూల్ ఆవరణలో జూడో, రెజ్లింగ్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. పలువురు విజేతలు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. డీఐఈవో కల్పన, డీవైఎస్‌వో సురేశ్, మున్సిపల్ చైర్‌పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు, స్పోర్ట్స్‌క్లబ్ అధ్యక్షుడు ఎం.రవీందర్, జూడోసంఘం అధ్యక్షుడు మాటేటి సంజీవ్‌కుమార్ పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ దాసరి వేణు
ఉత్సాహంగా సీఎం కప్ పోటీలు
Comments
Please login to add a commentAdd a comment