సొంతింటి పథకం అమలు కోసం ఉద్యమం
● సీఐటీయూ అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి
గోదావరిఖని: సొంతింటి పథకం అమలు కోసం ఉద్యమించాలని సీఐటీయూ అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శి మంద నర్సింహారావు పేర్కొన్నారు. గురువారం ఆర్జీ–1 ఏరియా జీడీకే–11గని, స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల దీర్ఘకాలిక సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలు చర్చించాలన్నారు. కార్మికుల చిరకాల కోరిక సొంతింటి పథకాన్ని అమలు చేయాలన్నారు. మారుపేర్ల కార్మికుల విజిలెన్స్ కేసులను ఎత్తివేసి సమస్య పరిష్కరించాలన్నారు. అసెంబ్లీ, సింగరేణి ఎన్నికలు జరిగి ఏడాది గడిచినా ఇప్పటికి ఒక్క సమస్య పరిష్కారం కాలేదన్నారు. సీఐటీయూ నిర్వహించే దశలవారీ పోరా టంలో యూనియన్లకు అతీతంగా కార్మికులు కలిసిరావాలన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆరెపల్లి రాజమౌళి, మెండె శ్రీనివాస్, జెల్లా గజేంద్ర, తోట నరహరిరావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment