వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు
గోదావరిఖని: సింగరేణి ఆవిర్భావ వేడుకల నిర్వహణకు యాజమాన్యం ఏర్పాట్లు చేసింది. రామగుండం రీజియన్‌లోని మూడు ఏరియాల్లో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇందుకోసం ఆర్జీ–1లోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం, ఆర్జీ–2లోని అబ్దుల్‌కలాం స్టేడియాలను ముస్తాబు చేశారు. జబర్దస్త్ కళాకారులు, స్థానిక కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సింగరేణిలోని వివిధ విభాగాల ప్రత్యేకతలను చాటేలా ఎగ్జిబిషన్, స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ రుచులు ప్రత్యేకంగా అందుబాటులో ఉంచుతారు. ఆర్జీ–1లో జీఎం లలిత్‌కుమార్, ఆర్జీ–2లో జీఎం వెంకటయ్య ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఆర్జీ–1, 2 ఏరియాల్లో ప్రత్యేక స్టాళ్లు
ముస్తాబైన సింగరేణి స్టేడియాలు
నేడు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం
Comments
Please login to add a commentAdd a comment