ఆలిండియా రెస్క్యూ పోటీల్లో ప్రతిభ
గోదావరిఖని: ఆలిండియా రెస్క్యూ పోటీల్లో సింగరేణి బీ– జట్టు సత్తాచాటింది. ఓవరాల్ రెండో స్థానం కైవసం చేసుకుంది. 53వ ఆలిండియా రె స్క్యూ పోటీలు ధన్‌బాద్‌లో ఈనెల 16 – 20వ తేదీ వరకు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 33 జట్లు పా ల్గొనగా, ఇందులో ఐదు మహిళా టీంలు ఉన్నాయి. సింగరేణి నుంచి ఏ, బీ టీంలు హాజరయ్యాయి. బీ– టీం ఓవరాల్ రెండోస్థానం, ఏ– టీం నాలుగో స్థానం సాధించాయి. పలు ఈవెంట్లలో 8 బహుమతులు కూడా వచ్చాయి. ఫస్ట్ ఎయిడ్‌లో ఓవర్‌రాల్ మొదటి, రెండో బహుమతి, రెస్క్యూ అండ్ రికవరీ విభాగంలో బీ– టీం రెండోస్థానం, రిలే రేస్ విభా గంలో మొదటిస్థానం, సెకండ్ బెస్ట్ కెప్టెన్‌గా ఏ– టీం కెప్టెన్ గణేశ్ రామన్, బెస్ట్ మెంబర్‌గా బీ – టీంలోని కె.బానుప్రసాద్ బహుమతులు సాధించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీం కోచ్ బి.శ్రావణ్‌కుమార్, ఎస్.మధుసూదన్‌రెడ్డి, ఇన్‌చార్జి జి.రాజేందర్‌రెడ్డి, నర్సింహమూర్తి, సూపర్‌గ్రూప్ కమిటీ మెంబర్లుగా జీఎం శ్రీనివాస్‌రెడ్డి, రెస్క్యూ సూపరింటెండెంట్ మాధవరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment