‘డయల్ యువర్ డీఎం’కు స్పందన
మంథని: స్థానిక ఆర్టీసీ డి పో పరిధిలో శుక్రవారం ని ర్వహించిన డయల్ యువ ర్ డీఎం కార్యక్రమానికి ప్ర యాణికుల నుంచి మంచి స్పందన వచ్చినట్లు డిపో మేనేజర్ శ్రావణ్‌కుమార్ తెలిపారు.15 మంది ఫోన్ ద్వారా సమస్యలు, సూచనలు చేసినట్లు చెప్పా రు. మంథని– జమ్మికుంట మధ్య రాత్రివేళ బస్సు సర్వీస్ పునరుద్ధరించాలని, మంథని – జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెలకు బస్సు నడిపించాలని, కాళేశ్వరం – వేములవాడకు బస్సులు నడిపించాలని ప్రయాణికులు సూచించారని అన్నారు. పెద్దపల్లి నుంచి మంథనికి భాగ్యనగర్ ట్రైన్‌కు లింక్ బస్సు నడిపించాలని సూచనలు చేశారన్నారు. ఈ సమస్యలు, సూచనలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని డీఎం వివరించారు.
మహిళల రక్షణే లక్ష్యం
జ్యోతినగర్(రామగుండం): మహిళల రక్షణే షీ టీం లక్ష్యమని గోదావరిఖని ఏసీపీ రమేశ్ అన్నారు. ఎన్టీపీసీ జెడ్పీ హైస్కూల్‌లో శుక్రవా రం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మా ట్లాడారు. బస్‌స్టేషన్లు, ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, కళాశాలలు పరిధిలో షీటీం నిరంతరం విధులు నిర్వర్తిస్తోందని తెలిపారు. వేధింపులకు గురైన వారు 63039 23700 నంబర్‌కు ఫోన్‌చేసి సమస్య తెలియజేయాలని ఆయన సూచించారు. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. రామగుండం సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై ఉదయ్‌కిరణ్, షీటీం ఇన్‌చార్జిలు మల్లయ్య, సురేశ్, స్నేహలత, సీడీపీవో అలేఖ్య, సంధ్య, స్వర్ణలత, సుమతి, హెచ్‌ఎం జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.
పాఠశాల సందర్శన
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): గంగారం గ్రామ పంచాయతీ పరిధిలోని ఊశన్నపల్లె మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను లక్నో బృందం ఽశుక్రవారం సందర్శించింది. బృందంలోని దేవి సంస్థాన్ పెడ గాజీ విభాగానికి చెందిన స భ్యులు సయ్యద్ మహ్మద్ సలీం, ప్రవీణ్ యాదవ్ విద్యార్థులతో మాట్లాడారు. ఎఫ్‌ఎల్‌ఎన్ అమలు తీరుపై ఆరా తీశారు. భాషాభివృద్ధి, గణిత ప్రక్రియలను పరీక్షించారు. మారుమూల గ్రామాల్లోనూ విద్యార్థులు ఇంగ్లిష్‌లో చక్కగా మాట్లాడటం ప్రశంసనీయమన్నారు. హెచ్‌ఎం ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయులు అ మృతసురేశ్, బండారి స్రవంతితోపాటు జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి పీఎం షేక్, డీఆర్పీ సంది సంపత్‌రెడ్డి పాల్గొన్నారు.
మంగపేటవాసికి పురస్కారం
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): మంగపేటకు చెందిన ఒల్లాల శ్రీనివాస్ 2024కుగాను డాక్టర్ స ర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ ఉత్తమ ఉపాధ్యా య పురస్కారం అందుకున్నారు. ఆంగ్లభాషపై ఆసక్తి పెంపొందించేలా 20 పరిశోధన పత్రాలు సమర్పించిన శ్రీనివాస్‌కు పాండిచ్చేరి ఇన్‌స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్(పీఐఎంఎస్) ఈ పురస్కారం అందజేసింది. వివిధ అంశాల్లో పరిశోధనలు చేసినందుకు ఆ సంస్థ ఏటా ఈ అవార్డులు అందిస్తోంది. శ్రీనివాస్ సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయనను గురుకులాల సమన్వయకర్త ఆర్‌ఎల్‌సీ సురేశ్, ప్రిన్సిపాల్ మహేశ్, ఉపాధ్యాయులు తదితరులు అభినందించారు.
దరఖాస్తులు ఆహ్వానం
జ్యోతినగర్(రామగుండం): మైనార్టీ విద్యార్థులకు ఉచిత వృత్తి శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి రంగారెడ్డి తెలిపారు. అర్హత గల ఇంజినీరింగ్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అకౌంట్స్ అ సిస్టెంట్ యూజింగ్ ట్యాలీ, ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రంగారెడ్డి పేర్కొన్నారు. ఆసక్తిగల ధ్రువీకరణపత్రాలను జతచేసి ఈనెల 27వ తేదీలోగా పెద్దపల్లిలోని తమ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment