రాష్ట్రంలో లాఠీ రాజ్యం నడుస్తోంది
● బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్
గోదావరిఖని: రాష్ట్రంలో లాఠీరాజ్యం నడుస్తోందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ విమర్శించారు. స్థానిక ప్రధాన చౌరస్తా సమీపంలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో శుక్రవారం ఆయన రిలే నిరాహార దీక్ష ప్రారంభించి మాట్లాడారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అక్రమ కేసులు నమోదు చేస్తూ రేవంత్‌రెడ్డి సర్కార్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. అక్రమ కేసులు ఎత్తివేయాలని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నేరవేర్చాలని డిమాండ్ చేశారు. ఉద్యమాల గడ్డ రామగుండం నుంచి రెవంత్‌రెడ్డి పాలన పతనం ప్రారభంమైందని ఆయన అన్నారు. కేటీఆర్‌పై నమో దు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసేదాకా బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు సా గుతాయని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు మూల విజయారెడ్డి, గోపు అయి లయ్యయాదవ్, కార్పొరేటర్లు గాదం విజయ, బాదె అంజలి, జనగామ కవితాసరోజిని, నారా యణదాసు మారుతి, అచ్చే వేణు, బొడ్డు రవీందర్, మేతుకు దేవరాజ్, రాకం వేణు, జిట్టవేన ప్రశాంత్, ముద్దసాని సంధ్యారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment