అమరజవాన్‌కు సేన అవార్డు
బోయినపల్లి(చొప్పదండి): హెలికాప్టర్ ప్రమాదంలో రాజన్నసిరిసిల్ల బోయినపల్లి మండలం మల్కాపూర్‌కు చెందిన పబ్బాల అనిల్‌కుమార్ 2023, మే 4న వీరమరణం పొందిన విషయం తెలిసిందే. భారత సైనిక దినోత్సవం సందర్భంగా ఈనెల 14 పుణెలో సైనిక పురస్కారాలు అందజేశారు. అనిల్‌కుమార్‌కు సేన మెడల్(గ్యాలంట్రీ) అవార్డు ప్రకటించారు. ఈ సందర్భంగా అమర జవాన్ అనిల్‌కుమార్ సతీమణి పబ్బాల సౌజన్యకు వీరనారీ టైటిల్ అందించారు. మల్కాపూర్‌కు చెందిన పబ్బాల లక్ష్మి–మల్లయ్య కుమారుడు అనిల్‌కుమార్ డిగ్రీ వరకు చదివాడు. 11 ఏళ్ల క్రితం ఆర్మీలో చేరాడు. మృతిచెందిన సమయంలో అనిల్ జమ్మూకాశ్మీర్ ఆర్మీ సీఎఫ్‌ఎన్ విభాగంలో ఏవీఎన్ టెక్నీషియన్‌గా పనిచేశాడు. అనిల్‌కు అయాన్, అరయ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
అనిల్ భార్యకు వీరనారి టైటిల్
సైనిక దినోత్సవం రోజు సౌజన్యకు అరుదైన గౌరవం
Comments
Please login to add a commentAdd a comment