దొంగతనం కేసులో ఇద్దరి అరెస్టు
మల్యాల(చొప్పదండి): మల్యాల మండలకేంద్రంలోని ఓ ఇంట్లో దొంగతనం జరిగిన కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. మల్యాల ఎస్సై నరేశ్‌కుమార్ కథనం ప్రకారం.. మల్యాలలో జనవరి 4న అర్ధరాత్రి మల్యాల మంజుల ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మంగళవారం వరదకాలువ సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని మల్యాలకు చెందిన మ్యాక మహేశ్, కుంద బాబుగా నిర్ధారించామని, మూడున్నర తులాల బంగారం, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఎస్సై వివరించారు. నిందితులను రిమాండ్‌కు తరలించాని ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment