తండ్రి సౌదీలో.. కొడుకు ఆస్పత్రిలో..
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని 29వ వార్డుకు చెందిన కుక్కల చిన్నభీమ య్య సౌదీ అరేబియా వెళ్లా డు. వీసా గడువు ముగియడంతో సౌదీ అరేబియాలోని దమాన్ నగరంలో అక్రమ నివాసిగా చిక్కిపోయాడు. అతని కుమారుడు సునీల్ బోన్‌మ్యారో (ఎముక ములుగు) వ్యాధితో ఆస్పత్రి పాలయ్యాడు. బోన్ మార్పిడి చికిత్సకు దాతగా చిన్నభీమయ్యను సౌదీ నుంచి రప్పించాలని అతని భార్య గంగలక్ష్మీ బుధవారం కాంగ్రెస్ ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి సహాయంతో సీఎం రేవంత్‌రెడ్డికి మెయిల్ ద్వారా వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గంగలక్ష్మి మాట్లాడుతూ చికిత్సకు కావాల్సిన డబ్బు కోసం తన ఇల్లు అమ్మడానికి అయినా భీమయ్య ఇండియాకు రావాల్సిన అవసరం ఉందన్నారు. సౌదీలో ఉన్న సామాజిక సేవకులు గాజుల నరేశ్ స్థానిక అధికారులతో కలిసి రియాద్‌లోని ఇండియన్ ఎంబసీలో సమన్వయం చేస్తున్నారని పేర్కొన్నారు.
మెయిల్ ద్వారా ముఖ్యమంత్రికి వినతి
Comments
Please login to add a commentAdd a comment