పేదల్లో పెద్దలా?
శుక్రవారం శ్రీ 17 శ్రీ జనవరి శ్రీ 2025
● రేషన్ జాబితాలో రిటైర్డ్ ఉద్యోగులు, కోటీశ్వరులు ● కులగణనలో తెల్లకార్డు లేదన్నవారి పేర్లు జాబితాలో ● గ్రామాల్లో రేషన్ దరఖాస్తుల్లో వింత చోద్యాలు ● కులగణన సర్వేలో లోపం వల్లే ఈ పొరపాటు ● జాబితాలో పేరులేని పేదలకు దక్కని ఊరట ● 360 డిగ్రీస్ యాప్‌తో ఆస్తుల చిట్టా తేటతెల్లం
8లోu
సాక్షిప్రతినిధి, కరీంనగర్:
సమాజంలో ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలకు నెలనెలా రేషన్ కోసం, ఆరోగ్యశ్రీ ఇతర సంక్షేమ పథకాలకు తెల్లరేషన్‌కార్డులు ప్రామాణికం. అయితే, ఈ రేషన్‌కార్డులు లేని కుటుంబాల జాబితాను ప్రభుత్వం రూపొందించి అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలకు పంపింది. ఈ జాబితాపై వాస్తవాలు తెలుసుకునేందుకు ప్రభుత్వ అధికారులు సర్వే ప్రారంభించారు. ఈ జాబితా చూసిన గ్రామస్తులు, అధికారులు అవాక్కవుతున్నారు. ఎందుకంటే ఆ గ్రామంలో భూస్వాములు, కోటీశ్వరులు, వ్యాపారులు కూడా జాబితాలో ఉన్నారు. ఇలా ఎందుకు జరిగిందని ఆరాతీస్తే.. ఇటీవల జరిగిన బీసీ కులగణన సర్వేలో వివరాల నమోదులో లోపమే ఇందుకు కారణమని పలువురు అధికారులు వెల్లడించారు.
ఏం జరిగింది?
ఇటీవల సామాజిక కులగణనును ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా నిర్వహించింది. ఆ సమయంలో చాలా మంది తమ కుటుంబాలకు రేషన్‌కార్డు లేదు అని చెప్పారు. అందులో రేషన్‌కార్డు లేని పేద, మధ్య తరగతి కుటుంబాలతోపాటు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు, కోటీశ్వరులు, భూస్వాములు, వ్యాపారులు ఇతరులు తమకు రేషన్‌కార్డులేదని చెప్పారు. వచ్చిన ఎన్యూమరేటర్లు కూడా అవే వివరాలు నమోదు చేసుకుని వెళ్లిపోయారు. అప్పుడు రేషన్‌కార్డు కాలమ్‌లో లేదని తెలిపిన పేద, ఉన్నత వర్గాలకు చెందిన అందరి పేర్లు ప్రత్యక్షమయ్యాయని అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో పనిచేస్తున్న వారి ఐడీ నంబర్లు రాసుకోవడం వల్ల వారి పేర్లు రాలేదని, మిగిలిన వారి పేర్లు జాబితాలో వచ్చాయని వివరిస్తున్నారు. ఈ జాబితాలో అర్హులను గుర్తించేదుకు మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో సర్వే జరుగుతోంది. అనంతరం గ్రామసభల్లో ఈ జాబితాలను ప్రదర్శించి అభ్యంతరాల ఆధారంగా చర్యలు చేపడతారు.
360 డిగ్రీస్ యాప్‌తో దొరికిపోతారు
అదే సమయంలో అధికారులు అంతా ఈ జాబితాపై ఎలాంటి ఆందోళన అక్కర్లేదని అంటున్నారు. ఈ సర్వేతోపాటు గ్రామాల్లో నిర్వహించే గ్రామసభల్లోనే అనర్హులను (అధిక ఆదాయం ఉన్నవారు) 90 శాతం గుర్తిస్తామని ధీమాగా ఉన్నారు. ఒకవేళ ఎవరైనా తమ దృష్టి నుంచి తప్పించుకున్నా.. జాబితాపై పౌరసరఫరాలశాఖ 360 డిగ్రీస్ యాప్‌లో తుదిజాబితాను మరోసారి తనిఖీ చేస్తుంది. ఈ యాప్‌లో దరఖాస్తు దారుల భూములు, వాహనాలు, ఐటీ వివరాలు, ఆర్థిక స్థితిగతులు మొత్తం తెలిసిపోతాయని విశ్వాసంగా ఉన్నారు. కాబట్టి, ఈ జాబితాపై ఎలాంటి ఆందోళన అక్కర్లేదని అభిప్రాయపడ్డారు.
జాబితాలో లేని వారిపై మౌనం
చాలాచోట్ల రేషన్‌కార్డు జాబితాలో కొందరు పేదలకు చోటు దక్కలేదు. వీరికి జరిగిన విషయం తెలియక శ్రీమంతులు, రిటైర్డ్ ఉద్యోగుల పేర్లు జాబితాలో ఎక్కి.. తమ పేర్లు ఎక్కకపోవడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు మౌనం వహిస్తున్నారు. రేషన్‌కార్డుకు దరఖాస్తు చేసుకుని, అన్ని అర్హతలు ఉండీ.. జాబితాలో చోటు దక్కని పేదలకు దరఖాస్తు చేసుకునేందుకు తిరిగి ఎప్పుడు అవకాశం కల్పిస్తారు? అన్న ప్రశ్నకు అధికారుల వద్ద సమాధానం లేదు. అది ప్రభుత్వం చేతిలోనే ఉందని, దానిపై తమకు ఎలాంటి సమాచారం లేదని రెవెన్యూ, గ్రామ పంచాయతీ, మున్సిపల్ అధికారులు స్పష్టంచేస్తున్నారు.
న్యూస్‌రీల్
రేషన్‌కార్డు దరఖాస్తులు
పెద్దపల్లి 14,910
జగిత్యాల 35,101
సిరిసిల్ల 20,976
కరీంనగర్ 18,384
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీరావుపూర్ గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగి తండ్రిపేరు రేషన్‌కార్డు దరఖాస్తు జాబితాలో పేరు ప్రత్యక్షమైంది.
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కమాన్‌పూర్ గ్రామంలో విశ్రాంత ఎంఈవో, రైస్‌మిలర్ల పేర్లు రేషన్‌కార్డు దరఖాస్తుల్లో కనిపించడం
చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment