మిగిలింది వారమే!
పెద్దపల్లి
శనివారం శ్రీ 18 శ్రీ జనవరి శ్రీ 2025
● బల్దియాల్లో ప్రత్యేక పాలనకు సిద్ధం ● పాలకవర్గాల పదవీకాలం 26వరకే ● కరీంనగర్ కార్పొరేషన్‌కు 28వ తేదీ వరకు అవకాశం ● ప్రత్యేకాధికారుల నియామకానికి ప్రభుత్వం ఏర్పాట్లు ● ఉమ్మడి జిల్లాలో రెండు కార్పొరేషన్లు ● 14 మున్సిపాలిటీలు
I
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పాలకమండళ్ల పదవీకాలం మరో ఎనిమిది రోజుల్లో ముగియనుంది. పాలకవర్గాల గడువు ముగిసేలోగానే ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉండగా, స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచే దిశలో కాంగ్రెస్ ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి కులగణన చేపట్టింది. ఆ కమిటీ నివేదికను అనుసరించి పంచాయతీలు, బల్దియాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే పదవీకాలం పూర్తి చేసుకున్న సర్పంచ్‌లు, మండల, జిల్లా పరిషత్‌ల్లో ప్రత్యేకాధికారుల పాలన సాగుతుండగా, అదేబాటలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న బల్దియాల్లో ఈనెల 27నుంచి ప్రత్యేకాధికారుల పాలన అమల్లోకి రానుంది. ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
గడువు జనవరి 26 వరకే
ఉమ్మడి జిల్లాలో కరీంనగర్, రామగుండం కార్పొరేషన్‌తో పాటు 14మున్సిపాలిటీలున్నాయి. ఆయా పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించగా 2020 జనవరి 27న కొలువుదీరాయి. ఈనెల 26తో పాలకవర్గాలకు పదవీకాలం ముగియనుంది. కరీంనగర్ కార్పొరేషన్‌కు రెండురోజుల ఆలస్యంగా ఎన్నికలు జరగటంతో 2025 జనవరి 28తో పదవీకాలం ముగియనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పలు మున్సిపాలిటీల్లో అవిశ్వాసాలు పెట్టగా పలు చైర్మన్ పదవులు కాంగ్రెస్ వశం అయ్యాయి. పలు బల్దియాల్లో బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కారు దిగి హస్తం పార్టీలో చేరారు. కరీంనగర్ కార్పొరేషన్లలో పలువురి కార్పొరేటర్లపై భూ కబ్జా కేసులు నమోదుకావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
పంచాయతీ, పరిషత్‌ల తరువాతే
గ్రామపంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల తర్వాతే మున్సిపల్ ఎన్నికలు రానున్నాయి. ఎన్నికలకు ముందుగానే కొత్త మున్సిపాలిటీలు, విలీనమైన గ్రామాల్లో వార్డుల విభజన చేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో పాటు ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఆధారంగా బీసీ కమిషన్ నివేదిక అందిస్తుంది. ఆ తర్వాత కేబినెట్ రిజర్వేషన్లు ఖరారు చేసే అవకాశముంది. అనంతరం పంచాయతీల్లో, మండల, జిల్లాపరిషత్‌లకు, తరువాత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో బల్దియాల్లో మరో ఏడాదికి పైగా ప్రత్యేకాధికారుల పాలనలోనే కొనసాగే అవకాశముందని అధికారులు, ఎన్నికల్లో పోటీచేసే ఆశావహులు అంచనా వేస్తున్నారు.
న్యూస్‌రీల్
అవిశ్వాసాలు.. జంపింగ్‌లు
మంథని మున్సిపాలిటీలో 13వార్డుల్లో ఇద్దరు కాంగ్రెస్, 11 మంది బీఆర్‌ఎస్ నుంచి గెలుపొందగా పుట్ట శైలజ చైర్‌పర్సన్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏడుగురు బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరారు. శైలజపై అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో రమ మున్సిపల్ చైర్‌పర్సన్ కావడంతో కాంగ్రెస్ వశమైంది.
సుల్తానాబాద్ మున్సిపాలిటీలో 15 వార్డులుండగా, తొమ్మిది మంది బీఆర్‌ఎస్, ఆరుగురు కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. బీఆర్‌ఎస్ నుంచి చైర్‌పర్సన్‌గా సునీత ఎన్నికయ్యారు. తరువాత అవిశ్వాసం నెగ్గటంతో గాజుల లక్ష్మీరాజమల్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
జగిత్యాల మున్సిపాలిటీలో 48 వార్డులు ఉండగా, 30 బీఆర్‌ఎస్ గెలుచుకోగా, కాంగ్రెస్ 7, బీజేపీ 3, ఇండిపెండెంట్ 6, ఎంఐఎం 1, ఏఐఎఫ్‌బీ ఒక్కసీటు గెలుచుకుంది. బీఆర్‌ఎస్ నుంచి భోగ శ్రావణి చైర్మన్‌గా ఎంపికయ్యారు. కొన్ని కారణాలతో రాజీనామా చేయగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అవిశ్వాస తీర్మానం పెట్టారు. బీఆర్‌ఎస్ రెబల్ ఆడవాల జ్యోతి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ మద్దతుతో ఎన్నికయ్యారు.
కోరుట్ల మున్సిపాలిటీలో 33 వార్డులకు బీఆర్‌ఎస్ 21చోట్ల, బీజేపీ 5, ఎంఐఎం 2, కాంగ్రెస్ 2, ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికయ్యారు. బీఆర్‌ఎస్ నుంచి ఎన్నికై న కౌన్సిలర్ అన్నం లావణ్య ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరి మున్సిపల్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు.
రాయికల్ మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా 10 బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ చెరొక్కటి గెలిచాయి. మున్సిపల్ చైర్మన్‌గా బీఆర్‌ఎస్ నుంచి మోర హన్మాండ్లు ఎంపికయ్యారు. నాటకీయ పరిణామాల నేపథ్యంలో అవిశ్వాసం పెట్టగా, వీగిపోవడంతో మళ్లీ మోర హన్మాండ్లుకు చాన్స్ వచ్చింది.
రామగుండం కార్పొరేషన్‌లో 50డివిజన్లు ఉండగా, కాంగ్రెస్ 11, బీఆర్‌ఎస్ 18, బీజేపీ 6, అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 9, ఇతరులు 6సీట్లు గెలిచారు. బీఆర్‌ఎస్ నుంచి మేయర్‌గా గెలిచిన అనిల్‌కుమార్, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి హస్తం తీర్థం పుచ్చుకున్నారు.
సిరిసిల్లలో 39వార్డులకు బీఆర్‌ఎస్22, బీజేపీ 03, కాంగ్రెస్ 02, ఇండిపెండెంట్ అభ్యర్థులకు 12మంది గెలిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఐదుగురు కౌన్సిలర్లు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో కలిశారు. కానీ అవిశ్వాసం పెట్టకపోవడంతో మున్సిపల్ చైర్ పర్సన్‌గా జిందం కళా చక్రపాణి కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment