వర్మీ కంపోస్ట్ తయారీపై దృష్టి
● అదనపు కలెక్టర్ అరుణశ్రీ
కోల్‌సిటీ(రామగుండం): తడి చెత్తతో వర్మికంపో స్ట్ ఎరువు తయారు చేయాలని అదనపు కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్(ఎఫ్‌ఏసీ) అరుణ శ్రీ ఆదేశించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో శుక్రవారం ఆమె ఆకస్మికంగా పర్యటించారు. పా రిశుధ్య నిర్వహణ తీరుపై ఆరా తీశారు. విఠల్‌నగర్‌లో పగుళ్లు చూపిన వంతెనకు యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేయాలని ఆదేశించారు. గౌత మినగర్ కంపోస్ట్‌యార్డ్, డ్రైరీసోర్స్ సెంటర్ పరిశీలించారు. నగరపాలక సంస్థ పారిశుధ్య వాహనదారులతో సమావేశమయ్యారు. ఉదయం 5గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విధు లు నిర్వహించాలని ఆదేశించారు. చెత్తను డంపింగ్ యార్డ్‌కు తరలించాలని సూచించారు. కార్మికులకు ఉపకరణాలు, దుస్తులు తదితరాలను నిబంధనల మేరకు అందజేయాలని ఆదేశించారు. నగ రపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ రాయలింగు, ఈఈ రామన్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు నాగభూషణం, సునీల్ రాథోడ్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ మధుకర్ తదితరులు పాల్గొన్నారు.
క్యాలెండర్ ఆవిష్కరణ
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): తెలంగాణ పద్మశాలీ ఉద్యోగుల సంఘం నూతన సంవత్సరం–2025 క్యాలెండర్‌ను అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీతోపాటు సంఘం నేత బొద్దుల గంగయ్య ఆ విష్కరించారు. పద్మశాలీ సంఘం జిల్లా అధ్యక్షు డు కొలిపాక సారయ్య, ప్రధాన కార్యదర్శి కోటే శం, సభ్యులు విష్ణుమూర్తి, నరేశ్, రాజప్రసాద్, రమేశ్, స్వరూపరాణి, కుమారస్వామి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment