‘సహకారం’.. సాకారమయ్యేనా..?
విస్తృతమైన సేవలు
సహకార కేంద్రాల రైతుల ద్వారా ఇంతకాలం పంట రుణాలు, రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందించారు. సహకార సంఘాల సేవలు ప్రస్తుతం విస్తృతం చేశారు. వాణిజ్య బ్యాంకులుగా సేవలు అందించడంతోపాటు సూపర్‌బజార్, పెట్రోల్ బంకులు, వాటర్‌ప్లాంట్ తదితర రంగాల్లోనూ సహకార సంఘాలు అడుగుపెట్టాయి. పెద్దపల్లి మండలం అప్పన్నపేటలో సూపర్‌బజార్, సుల్తానాబాద్‌లో వాటర్‌ప్లాంట్, చిన్నకల్వల సొసైటీ ద్వారా పెట్రోల్ బంకు నిర్వహిస్తూ వ్యాపారరంగంలోనూ రాణిస్తున్నాయి.
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి జిల్లాగా అవతరించి ఏళ్లు గడుస్తున్నా జిల్లా సహకార బ్యాంకు (డీసీసీబీ) ఏ ర్పాటు చేయడంలో పాలకులు, అధికారులు అశ్రద్ధ కనబరుస్తున్నారు. జిల్లాలోని 14 మండలాల్లో ఉన్న 20 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల లావాదేవీలు ఇప్పటికీ ఉమ్మడి కరీంనగర్ కేంద్ర బ్యాంకు నుంచే సాగుతున్నాయి. ఆ బ్యాంకు పరిధి నుంచే జిల్లాలోని రైతాంగానికి పంట రుణాలను సహకారబ్యాంకు శాఖలు అందిస్తున్నాయి.
ఇతర శాఖలను విభజించిన రీతినే..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసమంటూ అప్పటి ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. ఆ క్రమంలో ఉమ్మడి జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు జిల్లా ప్రజాపరిషత్‌తో పాటు ఇతర శాఖలను బదలాయించిన తీరునే ఉమ్మడి జిల్లా సహకార బ్యాంకును ఏర్పాటు చేసేలా పాలకులు, అధికారులు చొరవ చూపాలని కోరుతున్నారు. అయితే కొత్తగా డీసీసీబీలను ఏర్పాటు చేయాలంటే ఆయా జిల్లాల పరిధిలోని సహకార సంఘాల లావాదేవీలను అంచనా వేసి రిజర్వ్ బ్యాంకుకు నివేదించాల్సి ఉంటుందని సహకార శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఆ ర్బీఐకి అందించిన నివేదిక ఆధారంగా ఆ బ్యాంకు నుంచి అనుమతి పొందాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. ఇప్పటికై తే తమకు డీసీసీబీ ఏర్పాటుపై ఎలాంటి ఆదేశాలు అందలేదని తెలిపారు.
కొత్తగా 7 సంఘాలు..
జిల్లాలోని 14 మండలాల్లో ఉన్న 20 సహకార సంఘాలకు తోడు మరోఏడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు కొత్తగా ఏర్పాటు చేయాలని ప్ర భుత్వానికి నివేదించారు. ఇందులో ఓదెల మండలంలోని కొలనూర్, ధర్మారం మండలంలోని దొంగతుర్తి, మంథని మండలంలోని గుంజపడుగు, వెంకటాపూర్, రామగిరి, పాలకుర్తి, అంతర్గాంలలో కొ త్తగా సహకార సంఘాల ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా ముత్తారం మండలం ఖమ్మంపల్లిలోనూ సహకార సంఘం ఏ ర్పాటు చేయాలంటూ రైతులు వినతిపత్రం అందించినట్లు డీసీవో కార్యాలయ వర్గాలు తెలిపాయి.
● జిల్లా సహకార బ్యాంకు ఏర్పాటయ్యేదెప్పుడో?
Comments
Please login to add a commentAdd a comment