భద్రతా ప్రమాణాలు పాటించాలి
● రామగుండం సీపీ శ్రీనివాస్
గోదావరిఖని: బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలని రామ గుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ సూచించా రు. తన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించి న పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌లోని ఏసీపీలు, బ్యాంకర్లతో భద్రతా ప్రమాణాలపై సమీక్షించా రు. కమిషనరేట్‌లోని పెద్దపల్లి జోన్‌లో 109 బ్యాంకులు, 79 ఏటీఎంలు, మంచిర్యాల జోన్‌లో 109 బ్యాంకులు, 89 ఏటీఎంలలో నాసిరకం సీసీకెమెరాలు ఉన్నాయని, సెక్యూరిటీ గార్డులు లేరని తేలిందన్నారు. అలారమ్‌తోపాటు, నైటివిజన్, హైరిజల్యూషన్ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. చాలానేరాల్లో నిందితులు సీసీటీవీలపై స్ప్రే చేసి ఫుటేజీలు పనిచేకుండా చేసి చోరీ లు చేస్తున్నారని తెలిపారు. డీవీఆర్‌లను రహస్య ప్రాంతాల్లో దాచాలన్నారు. బ్యాంకర్లకు సమీప పోలీస్ అధికారుల ఫోన్‌నంబర్లు, హెల్ప్‌లైన్ నంబర్లు తెలిసేలా బోల్డ్ అక్షరాలతో రాసుకోవాలని కోరారు. బ్యాంకు బయట వాహనాలు పార్కింగ్ ప్రాంతాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. రాత్రివేళ సెక్యూరిటీ గార్డుల పనితీరును ఆకస్మికంగా తనిఖీ చేయాలని సూచించారు. అడిషనల్ డీసీపీ(అడ్మిన్) రాజు, ఏసీపీలు రాఘవేంద్రరావు, ప్రతాప్, సీసీఆర్‌బీ సీఐ సతీశ్, ఐటీ అండ్ కమ్యూనికేషన్ సీఐ రాంప్రసాద్, ఆర్‌ఐ దామోదర్ పాల్గొన్నారు.
తప్పుడు అఫిడవిట్ సమర్పించొద్దు
పోలీస్ కేసుల క్లియరెన్స్ కోసం తప్పుడు అఫిడవిట్‌లు సమర్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ శ్రీనివాస్ హెచ్చరించారు. పాస్‌పోర్ట్, ఉద్యో గ నియామకాలు, విదేశాలకు వెళ్లడం, కంపెనీ లు, సంస్థలు, పరిశ్రమల్లో పనిచేయడం కోసం పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ అవసరమని, దీని కోసం దరఖాస్తు చేసుకున్న సుమారు 20మంది కేసులు నమోదై ఉన్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేయనున్నట్లు సీపీ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment