సార్.. బాగా చదువుకుంటున్నం
పెద్దపల్లిరూరల్: ‘సార్.. గురుకులంలో మేం బాగా చదువుకుంటున్నం.. అక్కడి సార్లు పాఠాలు మంచిగ చెబుతున్నరు’ అని పలువురు విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. రామగుండంలోని తబిత ఆశ్రమంలో వసతి పొందుతూ ప్రభుత్వ పాఠశాల లో చదువుకుంటున్న ఏడుగురు విద్యార్థులను కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇటీవల కాటారంలోని ప్రభుత్వ గురుకులంలో చేర్పించారు. సంక్రాంతి సెలవుల సందర్భంగా తమ ఇళ్లకు వచ్చిన చిన్నారులు.. శుక్రవారం కలెక్టర్‌ను కలిశారు. తమ భవిష్యత్‌ను తీర్చిదిద్దేలా నాణ్యమైన విద్య అందిస్తున్నందుకు చిన్నారులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతీఒక్కరి జీవితంలో కష్టసుఖాలు ఉంటాయని, వాటిని అధిగమిస్తూ లక్ష్యం సాధించాలని కలెక్టర్ సూచించారు. చదువుతోపాటు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment