సర్వేకు ప్రజలు సహకరిస్తున్నారా?
● కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లిరూరల్: ప్రభుత్వం ఈనెల 26 నుంచి అ మలు చేయనున్న సంక్షేమ పథకాల కోసం చేపట్టి న సర్వేకు ప్రజలు సహకరిస్తున్నారా? సరైన వివరాలు చెబుతున్నారా? అని కలెక్టర్ కోయ శ్రీహర్ష సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ ప రిధిలోని బంధంపల్లిలో చేపట్టిన సర్వే తీరును శు క్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెండు రోజుల్లోగా సర్వే పూర్తిచేయాలని సూచించా రు. ఆ తర్వాత వార్డు సమావేశాల్లో రైతుభరోసా, రేషన్‌కార్డు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు ఎంపికై న లబ్ధిదారుల జాబితా ప్రదర్శించాలని సూచించా రు. వ్యవసాయయోగ్యం కాని భూములను ంచి రైతుభరోసా జాబితా నుంచి తొలగించాలన్నా రు. అర్హులకే సంక్షేమ ఫలాలు అందేలా చూడా లని ఆదేశించారు. తహసీల్దార్ రాజ్‌కుమార్, డిప్యూటీ తహసీల్దార్ స్వప్న పాల్గొన్నారు.
కార్యాలయాల నిర్వహణ మెరుగు పడాలి
కలెక్టరేట్‌లోని కార్యాలయాల నిర్వహణ మరింత మెరుగుపడాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్‌లోని పలు కార్యాలయాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. టాయిలెట్ల నిర్వహణ తీరుపై సిబ్బందిని మందలించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్లు అరుణశ్రీ, వేణుతో కలి సి అధికారులతో సమావేశమై పలు సూచనలి చ్చారు. ఉద్యోగులు డైనింగ్‌హాల్‌లోనే భోజనం చే యాలన్నారు. ఫైళ్లు, రికార్డుల నిర్వహణ సరిగ్గా ఉండాలన్నారు. పాత ఫర్నీచర్ తీసేసి కొత్త ఫర్నీచర్ సమకూర్చుకోవాలని సూచించారు. పారిశు ధ్య నిర్వహణపై శ్రద్ధ చూపాలని పేర్కొన్నారు. ఏవో శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment