పకడ్బందీగా భూముల సర్వే
జూలపల్లి/సుల్తానాబాద్/సుల్తానాబాద్ రూరల్ (పెద్దపల్లి): సాగుకు యోగ్యంకాని భూముల సర్వేను పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ వేణు ఆదేశించారు. జూలపల్లి, సుల్తానాబాద్ తహసీల్దార్ కార్యాలయం, నర్సయ్యపల్లి, గర్రెపల్లిలో సాగుకు యోగ్యం కాని భూములు, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు, రైతుభరోసా తదితర పథకాలపై సాగుతున్న సర్వేను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అర్హులను పారదర్శకంగా ఎంపిక చేయాలని ఆయన సూచించారు. నిబంధనలు ప్రకారం సర్వే చే యాలని ఆదేశించారు. జూలపల్లి, సుల్తానాబాద్ తహసీల్దార్లు స్వర్ణ, వ్యవసాయాధికారి ప్రత్యూ ష, ఎంపీడీవో దివ్యదర్శన్ పాల్గొన్నారు.
పనుల్లో వేగం పెంచండి
జూలపల్లి(పెద్దపల్లి): ఉపాధిహామీ పథకంలో చేపట్టిన గ్రామీణ నర్సిరీల్లో పనులను వేగవంతం చేయాలని డీఆర్డీవో కాళిందిని సూచించా రు. స్థానిక నర్సరీ, ఉపాధిహామీ పనుల కంప్యూటరీకరణను శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. మొక్కల వివరాలు, రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో పద్మజ, ఏపీవో స దానందం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఉచిత శిక్షణ
పెద్దపల్లిరూరల్: బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఉద్యోగ, నైపుణ్యం కోసం ఉచిత శిక్షణ ఇస్తున్నామని, ఆసక్తి, అర్హత గలవారు ఫిబ్రవరి 9లోగా దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమాధికారి రంగారెడ్డి కోరారు. ఎస్సెస్సీ, ఆర్‌ఆర్‌బీ, బ్యాంకింగ్ రంగాల్లో కరీంనగర్ వారు శిక్షణ ఇస్తారన్నారు. వివరాలకు 0878–2268686 ఫోన్ నంబరులు సంప్రదించాలని ఆయన కోరారు.
21న జాబ్‌మేళా
పెద్దపల్లిరూరల్: జిల్లాకు చెందిన విద్యావంతులైన నిరుద్యోగులకు హెదరాబాద్‌లోని కేఎల్ టెక్నికల్ సర్వీసెస్, మేడ్చల్‌లో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈనెల 21న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి తిరుపతిరావు తెలిపారు. కలెక్టరేట్‌లోని తమ కార్యాలయం(రూం నంబరు 225)లో నిర్వహించనున్నట్లు వివరించారు. వివరాలకు 70 931 72221, 89853 36947, 81212 62441 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
మద్యం తాగి డ్రైవింగ్ చేయొద్దు
పెద్దపల్లిరూరల్: మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు కారకులు కావొద్దని రామ గుండం ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు సూచించారు. స్థానిక బస్టాండ్ ప్రాంతంలో వ్యాన్, ఆ టో డ్రైవర్లు, యజమానులకు సీఐ అనిల్‌కుమా ర్‌తో కలిసి రోడ్డు భద్రతపై శుక్రవారం అవగాహన కల్పించారు. ఏకాగ్రతతో వాహనం నడపా లన్నారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం నేరమని తెలిపారు. వాహన ధ్రువీకరణ పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు. బైక్ నడిపే వారు హెల్మెట్, కారు నడిపే వారు సీటుబెల్ట్ ధరించాలని ఆయన అన్నారు.
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
ఎలిగేడు(పెద్దపల్లి): అర్హులైన పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో 30 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు రూ.30,03,480 విలువైన చె క్కులను శుక్రవారం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. తహసీల్దార్ బషీరొద్దీన్, ఎంపీడీవో భాస్కర్‌రావు, ఎంపీవో ఆరిఫ్, సింగిల్‌విండో చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి ఉన్నారు. కాగా, లాలపల్లిలో నాలుగు రోజులుగా సాగుతున్న మల్లికార్జునస్వామి పట్నాలకు ఎమ్మెల్యే హాజరయ్యారు. పెద్దపల్లి ఏఎంసీ చైర్‌పర్సన్ ఈ ర్ల స్వరూప ఆధ్వర్యంలో ముద్రించిన 2025 సంవత్సర క్యాలెండర్‌ను శివపల్లి గ్రామంలోని తన నివాసంలో ఎమ్మెల్యే ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment