చకచకా ‘పెద్ద’పల్లి రైల్వేస్టేషన్ పనులు
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు చకచకా సాగుతున్నాయి. అమృత్ పథకంలో చోటు దక్కించుకున్న
పెద్దపల్లి రైల్వేస్టేషన్.. ఆధునిక హంగులు సంతరించుకుంటోంది. పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి. ఈనేపథ్యంలో వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. టికెట్ కౌంటర్ కోసం తాత్కాలిక షెడ్డు నిర్మించారు. రైల్వేస్టేషన్‌లోని లోడింగ్, అన్‌లోడింగ్ పాయింట్ వద్ద పనులు కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment