పరిమాణం తగ్గుతోంది
మెనూ ఇది
గోదావరిఖని: సింగరేణి సంస్థ తమ కార్మికుల కో సం గనులు, వివిధ డిపార్ట్‌మెంట్లపై టిఫిన్(అల్పా హారం), టీ, కాఫీ అందించేందుకు రాయితీతో కూ డిన క్యాంటీన్లు నిర్వహిస్తోంది. కార్మికులకు రుచి, శుచి, శుభ్రతతోపాటు నాణ్యమైన ఆహారం అందించేలా కార్పొరేట్ స్థాయిలో క్యాంటీన్లను తీర్చిదిద్దు తున్నామని ప్రకటించింది. ఆ స్థాయిలో నిధులు కూడా విడుదల చేస్తోంది. ఉప్మా, ఇడ్లీ, వడ, పూరి రుచిగా ఉంటున్నా.. పరిమాణం తగ్గుతోంది. చట్నీ పూర్తిగా నాసిరకంగా ఉంటోంది. సంస్థలో ప్రతీ రోజు సుమారు 48 వేల మంది కార్మికులు, ఉద్యోగులు క్యాంటీన్లలో అల్పాహారం భుజిస్తున్నారు.
ఓసీపీలు, భూగర్భ గనులపై 31 క్యాంటీన్లు..
సంస్థలో 89 క్యాంటీన్లు ఉండగా, 31క్యాంటీన్లు ఓసీ పీలు, భూగర్భగనులపై నిర్వహిస్తున్నారు. మిగతా వి వివిధ డిపార్ట్‌మెంట్లలో కొనసాగుతున్నాయి. ఇవికాకుండా మరో 14క్యాంటీన్ల నిర్వహణ బాధ్య తను కాంట్రాక్టర్లకు అప్పగించింది. ఓసీపీల్లో క్యాంటీన్ల అవసరం అధికం. అందుకే అందులోని ఒక్కోకార్మికుడిపై ప్రతినెలా రూ.200 చొప్పున రాయితీ చెల్లిస్తోంది. ఓసీపీల్లో ప్రతీషిఫ్టు ప్రారంభంతోపాటు టీ బ్రేక్ సమయంలో కూడా చాలా మంది అల్పా హారం తింటున్నారు. అలాగే భూగర్భగనుల్లో పనిచేస్తున్న కార్మికులకు ప్రతీనెల రూ.120 చొప్పున, డిపార్ట్‌మెంట్లపై రూ.110 చొప్పున యాజమాన్యం వెచ్చిస్తోంది. ఈ లెక్కన సుమారు 48 వేల మంది ఉద్యోగులకు సరాసరి రూ.150 చొప్పున రాయితీ చెల్లిస్తే.. ప్రతీనెల సింగరేణిపై రూ.72లక్షల భారం పడుతోంది. ఇన్ని నిధులు వెచ్చిస్తున్నా కార్మికులు తృప్తిగా టిఫిన్ చేయడంలేదంటున్నారు.
ఇడ్లీ, వడ, పూరి, ఉప్మా, ఖార, మసాల వడ, బోండాతోపాటు ఓసీపీల్లో ఆలూబిర్యాని, ఫ్రైడ్‌రైస్, కిచిడి, పులిహోర, కర్డ్‌రైస్.
2013 మార్గదర్శకాల ప్రకారం ఒక యూనిట్ లో 120 వడలు తయారు చేయాలి. చట్నీ కో సం అరకిలో పల్లీలు, రెండు కొబ్బరికాయలు వినియోగించాలి. కానీ, 30 పేట్ల వడలకు అవసరమైన చట్నీకోసం అరకిలో పల్లీలు, రెండు కొబ్బరికాయలు వినియోగగిస్తున్నారు.
క్యాంటీన్లలో ధరల పట్టిక
టిఫిన్ పరిమాణం ధర (రూ.లలో)
ఇడ్లీ ఒకటి 1
మినపవడ ఒకటి 1
ఉప్మా ఒకగరిట 1
పూరి ఒకటి 1
టీ ఒకకప్పు 1
కాఫీ ఒకకప్పు 2
మసాలవడ ఒకటి 1
ఫ్రైడ్‌రైస్ 400(గ్రాములు) 15
ఆలుబిర్యాని 400(గ్రాములు) 15
కిచిడి 400(గ్రాములు) 15
పులిహోర 400(గ్రాములు) 15
సింగరేణిలోని క్యాంటీన్లు 89
సంస్థ నిర్వహించేవి 75
కాంట్రాక్టర్ల నిర్వహణ 14
చట్నీ నాసిరకంగా ఉంటోంది అస్తవ్యస్తంగా సింగరేణి క్యాంటీన్లు
అల్పాహారంపై కార్మికుల పెదవి విరుపు
సింగరేణి క్యాంటీన్లను కార్పొరేట్‌స్థాయిలో తీర్చిదిద్దుతున్నాం. కానీ, మెత్తటి ఉప్మా, నాసి రకం చట్నీ వడ్డిస్తున్నారు.. నేను ఇంట్లో కూడా ఇలాంటి టిఫిన్ తినలేదు. తినను కూడా.
– ఆర్జీ–2లోని ఓసీపీ–3 క్యాంటీన్‌లో అల్పాహారం నాణ్యతపై డైరెక్టర్ వెంకటేశ్వర్‌రెడ్డి ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment