ఆర్టిజన్లను విద్యుత్ ఉద్యోగులుగా గుర్తించాలి
● ప్రారంభమైన సిబ్బంది రిలేదీక్షలు
పెద్దపల్లిరూరల్: విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్లను ఉద్యోగులుగా గుర్తించాలని మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు డిమాండ్ చేశారు. తమను విద్యుత్ ఉద్యోగులుగా పరిగణించాలనే డిమాండ్‌తో స్థానిక ఎస్‌ఈ కార్యాలయం ఎదుట ఆర్టిజన్లు సోమవారం రిలేదీక్షలు ప్రారంభించారు. రామకృష్ణారెడ్డి, ముత్యంరావు శిబిరాన్ని సందర్శించి ఆర్టిజన్లకు సంఘీభావం ప్రకటించారు. ఉద్యోగులతో సమానంగా సుమారు ఏడేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నా.. ఆర్టిజన్లుగా పేరు పెట్టి శ్రమదోపిడీ చేస్తున్నారని వారు ఆరోపించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్టిజన్లను వెంటనే విద్యుత్ ఉద్యోగులుగా గుర్తించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క దృష్టికి కూడా తీసుకెళ్లామని ఆర్టిజన్ల సంఘం జిల్లా కన్వీనర్ కిషన్‌రెడ్డి తెలిపారు. నాయకులు రాజు, విశ్వనాథ్, శ్రీనివాస్‌రెడ్డి, ఎల్లయ్య, రఘు, సందీప్, దేవేందర్, రవి, సతీశ్‌రెడ్డి, శ్రీనివాస్, కృష్ణ, శరత్, రాజబాబు, సుమన్, నర్సయ్య, రాజేందర్, శేఖర్, యూసుఫ్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment