నాణ్యత పెంచాలి
సింగరేణి క్యాంటీన్లలో నాణ్యత పెంచాలి. స్ట్రక్చరల్ సమావేశాల్లో ఈ విషయంపై మాట్లాడాం. 2013లో షెడ్యూల్ ఇచ్చారు. షెడ్యూల్ రేట్ పెంచాలి. ప్రస్తుత అలవాట్లకు అనుగుణంగా మెనూలో మరిన్ని రకాలు చేర్చాలి. పూరి, ఉప్మా, వడ, ఇడ్లీ కాకుండా దోశె, పెసరట్టు, ఊతప్ప, రాగిదోశ, రాగిసంకటి, మిల్లెట్‌ఉప్మా తదితర ఆహార పదార్థాలు అందించాలి. ప్రైవేట్ క్యాంటీన్లలో నాణ్యత తగ్గింది. వాటిని మూసివేయాలి. సూపర్‌బజార్ల నుంచే క్యాంటీన్లకు నిత్యావసరాలు సరఫరా చేయాలి.
– సీతారామయ్య, అధ్యక్షుడు, ఏఐటీయూసీ
నూనె మళ్లీ వాడవద్దు
ఒకసారి వినియోగించిన నూనె మళ్లీ వాడితే అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. పరిమాణం సరి గా ఉండటం లేదు. ప్రైవేట్ క్యాంటీన్లలో నాణ్యత తక్కువగా ఉంటోంది. సింగరేణి యాజమాన్యం కొత్తమెనూ రూపొందించాలి. గుండెపోటు, బీపీ, షుగర్ సమస్యలు ఎక్కువగా వస్తున్న క్రమంలో మెనూ రూపకల్పనకు కమిటీ వేయాలి. క్యాంటీన్లు శుభ్రంగా ఉండటం లేదు. స్టోర్ రూంలలో ఎలుకలు తిరుగుతున్నాయి. పాత ఆయిల్ తీసుకున్న తర్వాతే కొత్త ఆయిల్ ఇవ్వాలి.
– తుమ్మల రాజారెడ్డి, అధ్యక్షుడు, సీఐటీయూ
Comments
Please login to add a commentAdd a comment