48 గంటల్లో ‘సదరం’ సర్టిఫికెట్
● దళారులను ఆశ్రయించి మోసపోవద్దు ● కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని దివ్యాంగులు సదరం శిబిరానికి హాజరైన తర్వాత 48 గంటల్లోపే సర్టిఫికెట్లు జారీ చేస్తున్నామని, దివ్యాంగులు డీఆర్డీవో కార్యాలయం నుంచి ధ్రువీకరణపత్రాలు పొందా లని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం గోదావరిఖనికి చెందిన దివ్యాంగురాలికి డీఆర్డీవో కాళిందినితో కలిసి సదరం సర్టిఫికెట్ అందించారు. అనంతరం పలు సూచనలిచ్చారు. శిబిరానికి హాజరైన వారికి వైకల్య నిర్ధారణ ధ్రువీకరణపత్రం కోసం తిరగాల్సిన అవసరం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. సర్టిఫికెట్ల కోసం దళారులను ఆశ్రయించి మోసపోవద్దని కలెక్టర్ సూచించారు. సదరం శిబిరాలు సర్టిఫికెట్ల జారీ తదితర విషయాలపై ఏమైనా సందేహాలు ఉంటే సమీపంలోని ఎంపీడీవో కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఆ తర్వాతే కలెక్టరేట్‌లోని డీఆర్డీవో కార్యాలయానికి రావాలని ఆయన సూచించారు.
ఏటీసీ భవనం పూర్తిచేయాలి
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ ఆవరణలో చేపట్టిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) భవన నిర్మాణాన్ని ఈనెలాఖరులోగా పూర్తిచేయా లని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. సో మవారం భవన పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. యువతకు ఉపాధి శిక్షణ ఇచ్చేందుకు ఏటీసీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలతో విద్యార్థులకు శిక్షణ ఇస్తారని అన్నారు. వీలైనంత త్వరగా పనులు పూర్తిచేసి శిక్షణ ఇచ్చే పరికరాలను నూతన భవనంలో బిగించే ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment