ఇంటింటికీ డిజిటల్ లాక్
● పట్టుకున్న వెంటనే శబ్దం ● అప్రమత్తం చేస్తున్న తాళం
గోదావరిఖని: చోరీల నియంత్రణకు ప్రజలు డి జిటల్ లాక్(తాళం) వినియోగించేలా పోలీసుశా ఖ ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. తాళం వేసి న ఇళ్లు లక్ష్యంగా దొంగలు చోరీలు చేస్తుండడంతో వీటికి ఆధునిక సాంకేతికతతో కూడిన తాళంతో చెక్ పెట్టాలని ప్రణాళిక రూపొందించారు. ఇందుకోసం యాంటీథెఫ్ట్ అలారం లాక్, యాంటీ థెఫ్ట్ అలారం డోర్, విండోస్ తదితర పరికరా లు వినియోగించాలని సూచిస్తున్నారు. ఇవన్నీ ఆ న్‌లైన్ మార్కెట్‌లోనే లభిస్తున్నాయి. దొంగలు ఒ కవేళ తాళం పగులగొట్టేందుకు యత్నిస్తే.. వెంట నే అలారం మోగుతుంది. ఇరుగుపొరుగువారు అప్రమత్తమైయ్యే అవకాశం ఉంది. అందుకే వీటి ని వినియోగించాలని పోలీస్ శాఖ సూచిస్తోంది.
ఆన్‌మోడ్‌లోనే..
ఇంటి తలుపు లేదా కిటికీ తెరిచే సమయంలో అలారం మోగేందుకు వీలుగా డిజిటల్ యాంటీ థెఫ్ట్ డివైస్ అమర్చాలి. దీనిని ఎల్లవేళలా ఆన్‌మోడ్‌లో ఉంచాలి. దీనిద్వారా కొత్త వ్యక్తులు తలుపులు తీసే ప్రయత్నం చేసిన వెంటనే ఇంట్లో ఏర్పాటు చేసిన డిజిటల్ డివైస్ నుంచి భారీ శబ్దం వస్తుంది. దీంతో దొంగలు భయపడి అక్కడి నుంచి పారిపోతారని భావిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ కిటికీలపై అలారం ఏర్పాటు మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఇది 105 – 110 వరకు డెసిబుల్స్ శబ్దంతో మోగుతుంది. చాలాదూరం వరకు శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది.
ధర రూ.300 – రూ.500
నాణ్యమైన డిజిటల్ లాక్, డోర్ డివైస్‌లు అమెజాన్, ఫ్లిఫ్‌కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్స్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిధర ఒక్కోటి రూ.300 నుంచి రూ.500 వరకు పలుకుతోంది. గాడ్జెట్లను ఆన్‌లైన్‌లో పరిశీలించి, పూర్తిగా తనిఖీ చేసుకున్నాకే కొనుగోలు చేయాలి. వీటి పనితీరు, వినియోగంపై యూట్యూబ్‌లో తెలుసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment